రద్దీ నియంత్రించేందుకు : పెట్రోల్ బంకుల్లో FASTag

  • Published By: madhu ,Published On : January 26, 2020 / 02:38 PM IST
రద్దీ నియంత్రించేందుకు : పెట్రోల్ బంకుల్లో FASTag

టోల్ ప్లాజాల వద్ద రద్దీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన FASTag విధానాన్ని పెట్రోల్ బంకుల్లో కూడా అమలు చేయాలని యోచిస్తోంది. దీనివల్ల వాహనాదారులు వెయిట్ చేసే ఛాన్స్ ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. బిల్లులను చెల్లించకుండానే..బయటకు వెళ్లే విధంగా కార్యాచరణ చేస్తున్నారు. పెట్రోల్ వాహనాల్లో నింపేందుకు..క్యూ లైన్‌లో వేచి ఉండడానికి చెక్ పెట్టే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. 

ఇటీవలే టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఫాస్టాగ్ స్టిక్కర్‌ను వాహనం ముందు అతికిస్తారు. టోల్ ప్లాజా వద్దకు చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేసిన పరికరం దానిని స్కాన్ చేస్తుంది. అంతకుముందుగానే బ్యాంకు ద్వారా అనుసంధానం చేసుకున్న విధంగా ఫీజు ఆటోమెటిక్‌గా కట్ అవుతుంది. మెసేజ్ నేరుగా రిజిస్టర్ చేసుకున్న ఫోన్‌కు వస్తుంది. ఇదే విధానాన్ని పెట్రోల్ బంక్‌లో అమలు చేయనున్నారుర. ముంబైకి చెందిన అంకుర సంస్థ AGS ట్రాన్స్ సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూపొందించిన కొత్త తరహా టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. 

ఎలా చేయాలి : – 
* ముందుగా మొబైల్‌లో ఫాస్ట్ లేన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 
* RFID రీడర్ స్టిక్కర్ వాహనం ముందు భాగం అతికించాలి. 
* బంక్‌లోకి వచ్చే ముందే..ఎంత పెట్రోల్ పోయించుకోవాలో ముందే యాప్‌లో ఫీడ్ చేయాలి. 

* బంక్‌లోకి వెళ్లగానే..ఎంత కావాలనేది యాప్ ద్వారా పెట్రోల్ పోసే వ్యక్తికి చేరిపోతుంది. 
* వెంటనే అతను పెట్రోల్ పోస్తాడు. డబ్బులు చెల్లించకుండానే రయ్యి ముంటూ ముందుకెళ్లాలి. 
* ముందే అనుసంధానం చేసుకున్న బ్యాంకు ఖాతా నుంచి సరిపడా డబ్బులు ఆటోమెటిక్‌గా కట్ అవుతాయి. 

* అనంతరం రిజిస్టర్ చేసుకున్న మొబైల్‌కు నోటిఫికేషన్ వస్తుంది. 
* ఈ తరహా వ్యవస్తను ముంబై, థానే, నవీ ముంబై, పూణే నగరాల్లోని HPCLకి చెందిన 120 బంకుల్లో అమలు చేస్తున్నారు. 
* మిగతా నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

* బంకుల్లో ఎక్కువ సేపు నిలబడాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు. 

ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు వైపు మళ్లించే విధంగా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఒత్తిడి తెచ్చి మరీ ఫాస్టాగ్స్ కొనిపించాలని నిర్ణయించింది. ఫాస్టాగ్ విధానం టోల్ ప్లాజాల వద్ద సంక్రాంతి నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

Read More : నవ్వులు పూయిస్తున్న వీడియో : పార్టీ చేసుకుని వేరే ఇంటికి వెళ్లాడు..తర్వాత