Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’

కార్పొరేట్ వ్యవహారాల శాఖ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను స్వీకరించిన తర్వాత, ఈడీ ఈ కేసుపై విచారణను ప్రారంభించింది. ఈడీ విచారణలో సంస్థపై ఉన్న ఆరోపణలు అన్నీ నిజమైనవేనని తేలింది. అలాగే సంస్థ డైరెక్టర్లు ఇచ్చిన అడ్రస్‌లు కూడా తప్పని తెలిసింది.

Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’

Vivo Fraud

Vivo Fraud: చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ వివో దేశంలో భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ఈ మోసం విలువ దాదాపు రూ.62,476 కోట్లుగా ఉంటుందని అంచనా. గురువారం ఈడీ ఒక ప్రకటనలో ఈ వివరాల్ని వెల్లడించింది. దీని ప్రకారం.. వివో సంస్థ రూ.1,25,185 కోట్ల ఆదాయం అర్జించగా, అందులో దాదాపు యాభై శాతం.. అంటే రూ.62,476 కోట్లను అక్రమంగా చైనాకు తరలించింది.

Dalai Lama: దలైలామా మా అతిథి.. చైనాకు భారత్ జవాబు

ఈ మోసంలో మొత్తం 23 కంపెనీలు పాలుపంచుకున్నాయి. భారీ నష్టాలు చూపి పన్నులు ఎగవేసినట్లు తేలింది. దేశంలో పన్నులు ఎగవేసి, అక్రమంగా నిధుల్ని చైనాకు తరలించిందన్న సమాచారం నేపథ్యంలో దేశంలోని వివో కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహించింది. ఇండియాలోని వివో సంస్థ ప్రధాన కార్యాలయంతోపాటు, జడ్‌టీఈ కార్పొరేషన్, వివో అనుబంధంగా ఉన్న సంస్థలకు చెందిన మొత్తం 48 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను స్వీకరించిన తర్వాత, ఈడీ ఈ కేసుపై విచారణను ప్రారంభించింది. ఈడీ విచారణలో సంస్థపై ఉన్న ఆరోపణలు అన్నీ నిజమైనవేనని తేలింది. అలాగే సంస్థ డైరెక్టర్లు ఇచ్చిన అడ్రస్‌లు కూడా తప్పని తెలిసింది.

Akasa Air: ఆకాశ ఎయిర్‌కు డీజీసీఏ అనుమతి.. ఈ నెలలోనే సర్వీసులు ప్రారంభం

మరోవైపు వివోకు చెందిన 119 బ్యాంకు అకౌంట్లను ఈడీ సీజ్ చేసింది. వీటిలో రూ.465 కోట్ల వరకు నిధులున్నాయి. 2 కేజీల బంగారం, రూ.73 లక్షల నగదు కూడా ఉన్నాయి. గత ఏప్రిల్‌లో చైనాకు చెందిన మరో మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీకి చెందిన రూ.5,551 కోట్లను సీజ్ చేయాలని ఈడీ ఆదేశించింది. వివో అంశంపై చైనా స్పందించింది. చట్ట ప్రకారం, వివక్ష లేకుండా, పారదర్శకంగా విచారణ చెయ్యొచ్చని సూచించింది.