PhonePe ATM ఫీచర్ : డబ్బులు Withdraw చేసుకోండిలా!

  • Published By: sreehari ,Published On : January 27, 2020 / 01:36 AM IST
PhonePe ATM ఫీచర్ : డబ్బులు Withdraw చేసుకోండిలా!

డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? మీకు PhonePe వ్యాలెట్ అకౌంట్ ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఫొన్‌పే నుంచి ATM ఫీచర్ వచ్చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఈజీగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం మిషన్లో కాదండోయ్.. మర్చెంట్స్ షాపుల్లో మాత్రమే వర్క్ చేస్తుంది. ఇన్ స్టంట్ క్యాష్ విత్ డ్రా చేసుకోవడానికి ఫోన్ పే ఈ యూనిక్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. Phonepe యూజర్ ఎవరైనా తమకు క్యాష్ కావాలనుకుంటే Phonepe యాప్ ఓపెన్ చేయండి.. అందులో Stores tabపై క్లిక్ చేయండి. Phonepe ATM ఐకాన్ పై Click చేయండి. 

దీంతో దగ్గరలోని ఏదైనా షాపులో ఈ సౌకర్యం అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవడమే.. ఈ పైలట్ ఫీచర్ ద్వారా మర్చెంట్ షాపు నుంచి రోజుకు రూ.1000 వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం.. ఈ ఫీచర్ ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రారంభమైంది. మర్చెంట్ షాపు దగ్గరకు వెళ్లి మీ ఫోన్ పే యాప్ లో Withdraw బటన్ పై క్లిక్ చేయండి. ఎంత అమౌంట్ అవసరమో Phonepe అకౌంట్లో ఎంటర్ చేసి మర్చంట్ కు ట్రాన్స్ ఫర్ చేయండి. 

వెంటనే మర్చంట్ తనకు అమౌంట్ రీసివ్ కాగానే.. అంతే మొత్తాన్ని క్యాష్ రూపంలో కస్టమర్ కు అందిస్తారని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సర్వీసు నుంచి మనీ విత్ డ్రా చేసుకునే క్రమంలో కస్టమర్ లేదా మర్చంట్లపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. కస్టమర్లకు బ్యాంకులు సెట్ చేసిన అదే విత్ డ్రా లిమిట్ కూడా ఫోన్ పేలో ఆఫర్ చేస్తోంది. ప్రతిసారి ఏటీఎం లేదా బ్యాంకుల దగ్గరకు పరిగెత్తుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కస్టమర్లకు దగ్గరకు ATM ఫీచర్ తీసుకొచ్చినట్టు కంపెనీ పేర్కొంది.