iPhone: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే కొద్ది రోజులు ఆగండి.. ఎందుకంటే..

కొత్త ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? అయితే మరికొద్ది రోజులు ఆగండి. ఎందుకంటే త్వరలో ఐఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. వచ్చే నెలలో యాపిల్ సంస్థ ఒక ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఐఫోన్ 14 విడుదలవుతుంది. ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి రాగానే, పాత ఫోన్ల ధరల్ని యాపిల్ తగ్గిస్తుంది.

iPhone: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే కొద్ది రోజులు ఆగండి.. ఎందుకంటే..

iPhone: ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 13 కొనాలి అనుకుంటున్నారా? అయితే కొద్ది రోజులు ఆగండి. ఎందుకంటే త్వరలోనే ఈ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం యాపిల్ సంస్థ సెప్టెంబర్‌లో ఒక వార్షిక ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్‌లో కొత్త ఐఫోన్‌తోపాటు, యాపిల్ వాచ్, ఐపాడ్ వంటి ఉత్పత్తుల్ని సంస్థ విడుదల చేస్తుంది.

Amit Shah: నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. మునుగోడు సభకు హాజరు.. షెడ్యూల్ ఇదే..

ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 7న ఈవెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఐఫోన్ 14 విడుదల కానుంది. ఆ వెంటనే ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. ఈ ఫోన్ ధర మిగతా ఐఫోన్లు అన్నింటికంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్త ఐఫోన్ల ధరలు ఎక్కువగా ఉంటే, వినియోగదారులు అంతకుముందే మార్కెట్లో ఉన్న పాత మోడల్ ఫోన్లనే ఎక్కువగా కొంటారు. దీనికోసమే పాత ఐఫోన్ల ధరల్ని కూడా కంపెనీ తగ్గిస్తుంది. కొత్త ఫోన్ రిలీజైన కొద్ది రోజుల్లోనే పాత మోడళ్ల ధరలు తగ్గుతాయి. ఈ లెక్కన ఐఫోన్ 14 విడుదల కాగానే, ఐఫోన్ 13, ఐఫోన్ 12 ధరలు తగ్గే అవకాశం ఉంది. ఐఫోన్ 11 ధరను కూడా తగ్గించే వీలుంది. అలాగే అనేక ఈ-కామర్స్ సంస్థలు అదనపు తగ్గింపు, క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.

Income tax: నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కన్ను.. 20 వేలు దాటితే నిషేధం

అందువల్ల కొత్తగా ఐఫోన్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వాళ్లు వచ్చే నెలలో కొత్త మోడల్ రిలీజయ్యే వరకు ఆగితే బాగుంటుందన్నది మార్కెట్ నిపుణుల అంచనా. ప్రస్తుతం ఐఫోన్ 13 ధర 128 జీబీకి రూ.79900గా ఉండగా, 256 జీబీ ఫోన్ ధర రూ.89900, 512 జీబీ ధర రూ.109900గా ఉంది. ఐఫోన్ 12 ధర 64 జీబీకి రూ.65,990గా, 128జీబీకి రూ.70,900గా, 256 జీబీ ధర రూ.80,900గా ఉంది.