ముందే ప్లాన్ చేసుకోండి : బ్యాంకులకు సెలవులే సెలవులు

  • Published By: madhu ,Published On : April 2, 2019 / 12:11 PM IST
ముందే ప్లాన్ చేసుకోండి : బ్యాంకులకు సెలవులే సెలవులు

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. బిజినెస్ వ్యవహారాలు..డబ్బు లావాదేవీలు, చెక్, డిడిలు జమ చేయడం వంటివి ముందుగానే చేసుకోండి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో పాటు పండుగ, ఇతరత్రా కారణాలతో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. బ్యాంకులు పనిచేయకపోయినా నెట్ బ్యాంకింగ్ ఉన్న వారికి సమస్యలు ఎదురు కాకపోవచ్చు. డిజిటల్‌ లావాదేవీలు జరుగుతుండడం..ఖాతాదారులు ఆన్‌లైన్‌ ద్వారా సేవలు వినియోగించుకోవచ్చు. ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులో చూద్దాం.
మార్చి ఆర్థిక సంవత్సరం నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ సెలవు.
ఏప్రిల్‌ 5 శుక్రవారం బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి. 
ఏప్రిల్ 06వ తేదీ ఉగాది. 
ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం.
ఏప్రిల్ 13వ తేదీ రెండో శనివారం
ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం. రామనవమి
ఏప్రిల్ 17వ తేదీ మహవీర్ జయంతి.
ఏప్రిల్ 19వ తేదీ గుడ్ ఫ్రైడే.
ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం
ఏప్రిల్ 27వ తేదీ నాలుగో శనివారం
ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం. 
ఈ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. అయితే సెలవులకు తగ్గట్లుగా ప్లాన్‌ చేసుకోవడం బెటర్.