మూడు రోజులు బంద్ : ఈ బ్యాంకులు మాత్రం పనిచేస్తాయి

  • Published By: madhu ,Published On : January 31, 2020 / 03:58 AM IST
మూడు రోజులు బంద్ : ఈ బ్యాంకులు మాత్రం పనిచేస్తాయి

బ్యాంకులు మూడు రోజుల పాటు మూత పడనున్నాయి. వేతన సవరణ డిమాండ్‌తో బ్యాంకు ఉద్యోగులు 2020, జనవరి 31 నుంచి శుక్రవారం, ఫిబ్రవరి 01 శనివారం రెండు రోజలు పాటు సమ్మె చేస్తున్నారు. ఎలాగూ 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ఎలాగూ బ్యాంకులు పని చేయవు. దీంతో మొత్తంగా మూడు రోజలు పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. సమ్మె ప్రభావం ఏటీఎంలపై కూడా పడుతోంది.

డబ్బులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. 9 బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBI) ఇచ్చిన పిలుపుతో ఉద్యోగులు ఈ సమ్మె జరుగుతోంది. ఈ ఐక్య వేదికలో అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య(AIBOC), అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం(AIBEA) బ్యాంక్ కార్మికుల జాతీయ సంఘం(NOBW) వంటివి ఉన్నాయి.

కానీ రెండు బ్యాంకులు మాత్రం పనిచేయనున్నాయి. ICCI, HDFC బ్యాంకులు మాత్రమే పనిచేయనున్నాయి. బ్యాంకులలో పేరుకపోతున్న నిరర్థక ఆస్తుల వసూళ్లు, 11వ వేతన సవరణ ఒప్పందం అమలు, ఐదు రోజుల పనిదినాలు, నూతన పెన్షన్ విధానం రద్దు తదితర మొత్తం 11 ప్రధాన డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. 

ఏప్రిల్ 01వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి సంఘాలు. 
రెండు విడతలుగా సమ్మెకు నిర్ణయించాయి. 
SBI, AndhraBank, Union Bankతో పాటు తదితర బ్యాంకులు, అలాగే ప్రైవేటు రంగంలోని బ్యాంకుల్లోని ఉద్యోగులు సమ్మెలో పాల్గొనున్నారు. 
 

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ (AIBEA) వెల్లడించింది. 
శుక్రవారం, శనివారం, ఆదివారం వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. 
తెరిచేది ఫిబ్రవరి 03వ తేదీ సోమవారమే. 

Read More : PACsలో ఎన్నికల కోలాహాలం : ఫిబ్రవరి 15న పోలింగ్