Amazon : అమెజాన్‌కు భారత్‌లో బేరాల్లేవమ్మా .. రూ.50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినా రాని లాభాలు

అమెజాన్.. వరల్డ్ వైడ్ ఫేమస్ బ్రాండ్. ఏ దేశంలో పెట్టుబడి పెట్టినా.. ఎక్కడ బిజినెస్ మొదలు పెట్టినా.. ఇన్వెస్ట్‌మెంట్‌కు తగ్గ లాభాలు రాబట్టుకుంటుంది. కానీ.. అమెజాన్ లెక్కలు మాత్రం.. ఇండియాలో వర్కవుట్ కావడం లేదు. ఎనిమిదేళ్లలో.. 50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినా.. ఆశించిన స్థాయిలో లాభాలు రాబట్టుకోలేకపోయింది అమెజాన్ ఇండియా.

Amazon : అమెజాన్‌కు భారత్‌లో బేరాల్లేవమ్మా .. రూ.50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినా రాని లాభాలు

Amazon

Amazon : అమెజాన్.. వరల్డ్ వైడ్ ఫేమస్ బ్రాండ్. ఏ దేశంలో పెట్టుబడి పెట్టినా.. ఎక్కడ బిజినెస్ మొదలు పెట్టినా.. ఇన్వెస్ట్‌మెంట్‌కు తగ్గ లాభాలు రాబట్టుకుంటుంది. దానికున్న బ్రాండ్ వాల్యూ అలాంటిది. కానీ.. అమెజాన్ లెక్కలు మాత్రం.. ఇండియాలో వర్కవుట్ కావడం లేదు. ఎనిమిదేళ్లలో.. 50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినా.. ఆశించిన స్థాయిలో లాభాలు రాబట్టుకోలేకపోయింది అమెజాన్ ఇండియా. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు.. ఇండియన్ మార్కెట్ సవాల్‌గా మారింది. వేల కోట్లు పెట్టుబడులు పెట్టినా.. లాభాలు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. అమెజాన్ బ్రాండ్‌కు.. వస్తున్న ప్రాఫిట్స్‌కు అస్సలు లింక్ కుదరట్లేదు. ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్‌లో లీడర్‌గా ఎదిగేందుకు.. ఎంత ప్రయత్నించినా.. అవేవీ వర్కవుట్ కావట్లేదు.

ఇండియా మొత్తం తమ గురించి మాట్లాడుతోందని అమెజాన్ ఎంత గొప్పగా చెప్పుకున్నా.. ఆడిట్‌లో మాత్రం అంత సీన్ లేదని తేలిపోతోంది. దేశంలో.. మహా నగరాల నుంచి మారుమూల ప్రాంతాల దాకా అన్ని చోట్లకూ అమెజాన్ తన సేవలను విస్తరించింది. ఒక్క క్లిక్‌తో.. కావాల్సినవన్నీ ఇంటి డోర్ బెల్ కొట్టి మరీ అందిస్తోంది. ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి నిత్యావసర సరుకుల దాకా ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి టెక్నాలజీ దాకా.. అన్నింటిని అందుబాటులోకి తెచ్చింది అమెజాన్. వీటన్నింటికీ మించి.. గడిచిన ఎనిమిదేళ్లలో.. ఇండియాలో 51 వేల కోట్లకు పైనే పెట్టుబడులు పెట్టింది. ఈ దెబ్బతో.. ఈ-కామర్స్ మార్కెట్‌లో అమెజాన్‌కు కీలక వాటా దక్కింది. ప్రతి సంవత్సరం దాదాపు లక్షన్నర కోట్ల విలువైన వస్తువులను అమ్ముతున్నా.. ఇవేవీ అమెజాన్ ఇండియాకు ఆశించిన స్థాయిలో లాభాలు తెచ్చి పెట్టడం లేదు

భారత్‌లో.. అమెజాన్ బిజినెస్‌కు సంబంధించి.. విదేశీ బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టెయిన్ రిలీజ్ చేసిన రిపోర్ట్‌లో.. ఈ విషయాలన్నీ బయటపడ్డాయ్. ఇప్పటికీ.. మార్జిన్ 5 నుంచి 10 శాతం నెగటివ్‌గా ఉండడం అంతుబట్టని విషయంగా తెలిపింది. దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ నుంచి గట్టిపోటీ ఎదురవడం, క్విక్ – కామర్స్, సోషల్ కామర్స్‌లో ప్రభావం చూపకపోవడం, టైర్ టు, టైర్ త్రీ పట్టణాల్లోకి పరిమిత విస్తరణ కంపెనీకి సవాళ్లుగా మారాయని.. బెర్న్ స్టెయిన్ తన రిపోర్టులో తెలిపింది. స్మార్ట్ ఫోన్లు, ఫ్యాషన్ విభాగంలో.. ప్రత్యర్థి సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. స్మార్ట్ ఫోన్ విక్రయ్యాల్లో.. మార్కెట్ వాటా పరంగా అమెజాన్ నెంబర్ వన్ పొజిషన్‌లోనే ఉన్నా.. పెద్దగా మార్జిన్లు మాత్రం రావడం లేదు.

ఇక.. ఫ్యాషన్ రంగంలో ఫ్లిప్ కార్ట్, మింత్రా వాటా 60 శాతం వాటా కలిగి ఉంది. అదే.. అమెజాన్‌కు మాత్రం 25 నుంచి 30 శాతం వాటానే ఉంది. 15 శాతం వాటా ఉన్న రిలయన్స్ అజియో.. చాలా వేగంగా వృద్ధిని నమోదు చేస్తోంది. అంతేకాదు.. కస్టమర్ల ఇంట్రస్ట్‌ని తెలియజేసే డౌన్‌లోడ్లు, విష్ లిస్ట్, యాక్టివ్ యూజర్ల విషయంలోనూ అమెజాన్ వెనకబడింది. ఈ విషయంలో.. మీషో దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే.. సోషల్ కామర్స్ యాప్ షాప్సీని ప్రారంభించిన ఫ్లిప్ కార్ట్‌కు కూడా ఆదరణ పెరిగినట్లు బెర్న్ స్టెయిన్ రిపోర్ట్ చెబుతోంది.

ఇండియాలో.. ఈ-కామర్స్ వ్యాపారం ఏటా 30 శాతం వృద్ధితో.. 2025 నాటికి 10 లక్షల కోట్లను దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. ఆ సమయానికి.. దేశంలో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య కూడా వంద కోట్లకు చేరుతుందని.. వీరిలో కనీసం 33 శాతం మంది ఆన్ లైన్ షాపింగ్ చేస్తారని నివేదికలు చెబుతున్నాయి. ఇండియాలో దాదాపు 8 వేల కోట్లు పెట్టుబడిగా పెడతామని 2014లో.. ఫ్లిఫ్ కార్ట్ ప్రకటించింది. ఆ మరుసటి రోజే.. అమెజాన్ దాదాపు 16 వేల కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. అయితే.. బెర్న్‌స్టెయిన్ అంచనా ప్రకారం.. గతేడాది ఇండియాలో ఫ్లిప్ కార్ట్.. 18 లక్షల కోట్ల విక్రయాలతో ఈ కామర్స్ రంగంలో ముందంజలో ఉంది. అమెజాన్.. సెకండ్ పొజిషన్‌లో కొనసాగుతోంది. అయితే.. వచ్చే 3 ఏళ్లలో ఈకామర్స్‌ బిజినెస్‌ మరింత ఊపందుకోనుంది.. దాన్ని క్యాచ్‌ చేయగలిగితేనే అమెజాన్‌కు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతుంది. కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. రిలయన్స్ జియోమార్ట్‌.. అమెజాన్ ప్లాన్లకు అడ్డం పడేలా ఉంది.