Rana: టెడ్ఎక్స్ హైదరాబాద్ 9వ ఎడిషన్ పోస్టర్ విడుదల చేసిన రానా దగ్గుబాటి

ఈ సంవత్సరం థీమ్‌ IGNITEను ఆవిష్కరిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. TEDxహైదరాబాద్‭తో చాలా కాలంగా అనుబంధమై ఉన్నాను. ఈ ఉత్సాహాన్ని మీతో పంచుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 17న జరిగే TEDxహైదరాబాద్ 9వ ఎడిషన్‌లో ఈ పరివర్తన శక్తిని చూసేందుకు సిద్దంగా ఉండండి

TEDx: టెడ్ఎక్స్ హైదరాబాద్ తమ వార్షిక కార్యక్రమం యొక్క 9వ ఎడిషన్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం ఆదివారం, సెప్టెంబర్ 17, 2023న గచ్చిబౌలిలోని ప్రధాన్ కన్వెన్షన్స్‌లో నిర్వహించనున్నారు. విఖ్యాత నటుడు, TEDxహైదరాబాద్ స్పీకర్ రానా దగ్గుబాటి, TEDxహైదరాబాద్ 2023 పోస్టర్, నేడు విడుదల చేశారు.

Kamal Haasan : ‘ప్రాజెక్ట్ K’ పై మరో ఇంట్రెస్టింగ్ టాక్.. ప్రభాస్‌తో కమల్ హాసన్? కమల్ గెస్ట్ రోల్..
“ఈ సంవత్సరం థీమ్‌ IGNITEను ఆవిష్కరిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. TEDxహైదరాబాద్‭తో చాలా కాలంగా అనుబంధమై ఉన్నాను. ఈ ఉత్సాహాన్ని మీతో పంచుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 17న జరిగే TEDxహైదరాబాద్ 9వ ఎడిషన్‌లో ఈ పరివర్తన శక్తిని చూసేందుకు సిద్దంగా ఉండండి. మనలో నిద్రాణమైన శక్తిని మేల్కొలిపే రోజుగా అది నిలుస్తుంది” అని రానా దగ్గుపాటి అన్నారు.

Dhanush : ముంబైలో ధనుష్.. ఇలా మారిపోయాడేంటి.. వైరల్ అవుతున్న ధనుష్ కొత్త లుక్..

“ఇగ్నైట్” నేపథ్యంతో నిర్వహిస్తున్న TEDxహైదరాబాద్ 2023 ఒకే ఆలోచన యొక్క పరివర్తన శక్తి లేదా ఒక విప్లవాన్ని ప్రేరేపించగల స్పూర్తిదాయక క్షణాన్ని కలిగి ఉంటుంది. ఇది పురోగతి, మార్పుకు సహాయపడుతుంది. రోజంతా జరిగే ఈ కార్యక్రమం మనలోని అభిరుచిని పెంపొందించడానికి, హాజరైన వారికి కొత్త కార్యక్రమం ప్రారంభించేందుకు మరియు వారి ఆశయాలను నెరవేర్చుకోవడానికి తగిన శక్తినివ్వడానికి అంకితం చేయబడింది. ఉత్సుకత, స్పూర్తితో, TEDxహైదరాబాద్, అభ్యాసం, ఎదుగుదల మరియు శ్రేష్ఠత వైపు మార్గాన్ని ప్రకాశింపజేస్తూ లోపల ఆశక్తి ని రేకెత్తించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ట్రెండింగ్ వార్తలు