RBI నుంచి కొత్త ప్రీపెయిడ్ పేమెంట్ కార్డు! 

  • Published By: sreehari ,Published On : December 25, 2019 / 08:17 AM IST
RBI నుంచి కొత్త ప్రీపెయిడ్ పేమెంట్ కార్డు! 

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) కొత్త రకమైన ప్రీపెయిడ్ పేమెంట్ కార్డు (PPI)ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త పేమెంట్ కార్డుతో ఈజీగా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. నెలలో రూ.10వేల పరిమితితో మీకు నచ్చిన వస్తువులను, ఏదైనా సర్వీసుల కొనుగోలు కోసం వినియోగించుకోవచ్చు.

‘చిన్న మొత్తంలో విలువైన డిజిటల్ పేమెంట్స్ చేసేలా ప్రేరణ కోసమే కాకుండా అత్యాధునిక యూజర్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ కొత్త రకమైన సెమీ క్లోజడ్ PPI పేమెంట్ కార్డును ప్రవేశపెట్టడం జరిగింది’ అని RBI ఒక సర్యూలర్ లో పేర్కొంది. PPI అనే ఫైనాన్షియల్ టూల్ సాయంతో వస్తువులు, సర్వీసులను కొనుగోలు చేసుకోవచ్చు. 

సర్యూలర్ ప్రకారం.. ఈ PPI కార్డులను బ్యాంకులు లేదా బ్యాంకేతర సంస్థలు వినియోగదారుడి కనీస వివరాల ఆధారంగా జారీ చేస్తాయి. ఒక నెలలో PPI కార్డులో రూ.10వేల కంటే అధిగమించరాదు. ఆర్థిక సంవత్సరంలో జమ అయిన మొత్తం నగదు రూ.1,20వేలకు మించరాదు. అంతేకాదు.. ఔట్ స్టాండింగ్ అమౌంట్ కూడా ఏదైన పరిమిత సమయంలో PPI కార్డుల్లో రూ.10వేల కంటే అధిగమించరాదు. 

పీపీఐ కార్డులను జారీ చేసేవారు ఎప్పుడైనా కార్డును క్లోజ్ చేసుకునే ఆప్షన్ అందించారు. క్లోజింగ్ సమయంలో కార్డులోని నగదును తిరిగి బదిలీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సెక్షన్ 18తో పాటు సెక్షన్ 10(2) పేమెంట్, సెటిల్ మెంట్స్ సిస్టమ్ యాక్ట్ 2017 కింద ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. సర్యూలర్ జారీ అయిన తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని సర్యూలర్ పేర్కొంది.