Please Note : 2020లో బ్యాంకు సెలవులు ఇవే

2020లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో అనే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఈ మేరకు హాలిడేస్ లిస్ట్ విడుదల చేసింది. దీనికి

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 07:49 AM IST
Please Note : 2020లో బ్యాంకు సెలవులు ఇవే

2020లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో అనే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఈ మేరకు హాలిడేస్ లిస్ట్ విడుదల చేసింది. దీనికి

2020 సంవత్సరంలో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో అనే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఈ మేరకు హాలిడేస్ లిస్ట్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో ఆర్బీఐ ఉంచింది. ఆర్బీఐ ప్రకటించిన ఈ జాబితాలోని సెలవుల్లో బ్యాంకులు పని చేయవు. అంతేకాదు ఆదివారాలు, రెండు/నాలుగు శనివారాల్లో కూడా బ్యాంకులు పని చేయవు. ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం 2020లో బ్యాంకులకు 20 రోజులు అధికారిక సెలవులు ఉన్నాయి.

2020లో బ్యాంక్ సెలవుల జాబితా:
* జనవరి 15 – సంక్రాంతి 
* ఫిబ్రవరి 21 – మహా శివరాత్రి
* మార్చి 9 – హోలీ
* మార్చి 25 – ఉగాది 
* ఏప్రిల్ 1- యాన్యువల్ క్లోజింగ్
* ఏప్రిల్ 2 – శ్రీరామనవమి 
* ఏప్రిల్ 10 – గుడ్ ఫ్రైడే 
* ఏప్రిల్ 14 – అంబేద్కర్ జయంతి 
* మే 1 – మే డే 
* మే 25 – రంజాన్ 

* ఆగస్ట్ 1 – బక్రీద్ 
* ఆగస్ట్ 11 – శ్రీకృష్ణ జన్మాష్టమి 
* ఆగస్ట్ 15 – ఇండిపెండెన్స్ డే 
* ఆగస్ట్ 22 – వినాయక చవితి 
* అక్టోబర్ 2 – గాంధీ జయంతి 
* అక్టోబర్ 24 – దసరా 
* అక్టోబర్ 30 – మిలాద్ ఉన్ నబీ 
* నవంబర్ 14 – దీపావళి
* నవంబర్ 30 – గురునానక్ జయంతి 
* డిసెంబర్ 25 – క్రిస్మస్

బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకుంటే వినియోగదారులకు మంచిదని… అందుకు తగినట్లుగా బ్యాంక్ పనులను చక్కబెట్టుకోవచ్చని.. ప్లానింగ్ చేసుకోవచ్చని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. ఇకపోతే బ్యాంకులకు సెలవులు ఉన్నా ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్ కు ఎలాంటి ఆటంకాలు ఉండ‌వని ఆర్బీఐ తెలిపింది.