Legal Loan Apps: అక్రమ లోన్ యాప్స్‌కు అడ్డుకట్ట.. లీగల్ లోన్ యాప్స్ జాబితా విడుదల చేయనున్న ఆర్బీఐ

అక్రమ లోన్ యాప్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అవుతోంది కేంద్రం. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న లోన్ యాప్స్ త్వరలో నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అనుమతి కలిగిన లోన్ యాప్స్ వివరాలతో ‘వైట్‌లిస్ట్’ సిద్ధం చేయబోతుంది ఆర్బీఐ.

Legal Loan Apps: అక్రమ లోన్ యాప్స్‌కు అడ్డుకట్ట.. లీగల్ లోన్ యాప్స్ జాబితా విడుదల చేయనున్న ఆర్బీఐ

Legal Loan Apps: లోన్ యాప్స్ మోసానికి గురై ఎందరో బలవుతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే, ఇంకొందరు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఇలా భారీ స్థాయిలో మోసాలకు పాల్పడుతున్న లోన్ యాప్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం రెడీ అవుతోంది.

Viral Video: సఫారి జీప్‌ను వెంటాడిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్టులు.. వీడియో వైరల్

అనుమతి లేని అక్రమ లోన్ యాప్స్‌ను నిషేధించబోతుంది. ఇందుకోసం చట్టబద్ధమైన, అన్ని అనుమతులు కలిగిన లోన్ యాప్స్‌ జాబితా సిద్ధం చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. చట్టబద్ధమైన లోన్ యాప్స్‌ వివరాలతో రూపొందించిన ‘వైట్‌లిస్ట్’ను త్వరలో ప్రకటించబోతుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఇటీవల జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ‘వైట్‌లిస్ట్’ సిద్ధమైన తర్వాత ఈ యాప్స్ మాత్రమే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటారు. దీనికోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు కూడా సూచనలు చేసింది. అనుమతి లేని యాప్స్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్స్‌లో ఉండవు.

Booster Shot: రాబోయేది పండుగల సీజన్.. బూస్టర్ డోసు తీసుకుంటేనే రక్షణ.. ప్రజలకు కేంద్రం సూచన

ఈ యాప్స్ నిర్వహించే లావాదేవీలన్నీ బ్యాంకు పరిధిలోకే వస్తాయి. ఈ నిర్ణయం వల్ల మనీ లాండరింగ్, పన్ను ఎగవేత, డాటా సేకరణ, ప్రైవసీకి భంగం కలగడం, షెల్ కంపెనీలు వంటివి కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ‘‘అక్రమంగా నడుస్తున్న లోన్ యాప్స్.. పేద ప్రజల జీవితాలకు హానికరంగా తయారయ్యాయి. అప్పులిచ్చి, వారి నుంచి నిర్వాహకులు అధిక వడ్డీలు గుంజుతూ, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతూ, వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు’’ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘వైట్‌లిస్ట్’ సిద్ధమైన తర్వాత నుంచి ఈ యాప్స్‌పై ఆర్బీఐ ప్రత్యేక నిఘా పెట్టనుంది.