eRupee: ఈ-రూపాయిపై ఆర్‭బీఐ కీలక ప్రకటన.. రేపటి ముహూర్తం

ఆర్‌బీఐ 2022-23లో సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని లాంచ్ చేస్తుందని గత బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సీబీడీసీ ప్రవేశంతో డిజిటల్ ఎకానమీకి మరింత ఊపు వస్తుందని ఆమె అన్నారు. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ రూపంలో జారీ చేసే చట్టబద్ధమైన కరెన్సీనే సీబీడీసీ అంటారు. క్రిప్టో కరెన్సీల్లో, డిజిటల్ రూపాల్లో జరిగే చెల్లింపులకున్న ప్రయోజనాలన్ని కూడా ఈ కరెన్సీకి ఉంటాయి

eRupee: ఈ-రూపాయిపై ఆర్‭బీఐ కీలక ప్రకటన.. రేపటి ముహూర్తం

RBI to start testing 'eRupee' digital currency in India starting 1 Nov

eRupee: డిజిటల్ రూపాయి (ఈ-రూపాయి)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. నవంబర్ 1 నుంచి మార్కెట్లోకి ఈ-రూపాయిని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇది ప్రస్తుతానికి టెస్టింగ్ ఉద్దేశంతో విడుదల చేస్తున్నారట. ఎంపిక చేసిన ప్రత్యేక లావాదేవీలకు డిజిటల్ రూపాయిని పైలట్ ప్రాజెక్టు కింద లాంచ్ చేయనున్నట్లు ఈ నెల మొదట్లోనే ఆర్‭బీఐ ప్రకటించింది. ఈ పైటల్ ప్రాజెక్టులో తొమ్మిది బ్యాంకులు పాల్గొంటున్నట్లు సోమవారం పేర్కొన్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కొటక్ మహింద్రా, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులు ఈ పైలట్ ప్రాజెక్టులో ఉన్నట్లు ఆర్‭బీఐ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లోని సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్‭మెంట్ కోసం ఎంపిక చేసిన కేసులలో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ వల్ల ఇంటర్ బ్యాంక్ మార్కెట్ మరింత సమర్థవంతంగా మారనుందని తాము భావిస్తున్నట్లు ఆర్‭బీఐ పేర్కొంది.

డిజిటల్ రూపాయి లేదంటే ఈ-రూపాయి అంటే ఏంటి?
ఆర్‌బీఐ 2022-23లో సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని లాంచ్ చేస్తుందని గత బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సీబీడీసీ ప్రవేశంతో డిజిటల్ ఎకానమీకి మరింత ఊపు వస్తుందని ఆమె అన్నారు. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ రూపంలో జారీ చేసే చట్టబద్ధమైన కరెన్సీనే సీబీడీసీ అంటారు. క్రిప్టో కరెన్సీల్లో, డిజిటల్ రూపాల్లో జరిగే చెల్లింపులకున్న ప్రయోజనాలన్ని కూడా ఈ కరెన్సీకి ఉంటాయి. బిట్ కాయిన్ వంటి ఇతర కరెన్సీలకున్న ప్రమాదాలు ఈ కరెన్సీకి ఉండవు. ఎందుకంటే ఇది పూర్తిగా ఆర్‌బీఐ ఆధ్వర్యంలోనే చలామణి అవుతుంది. ఎవరూ కూడా దీన్ని దొంగలించడానికి కుదరదు. ఇతర కరెన్సీల్లో ఉన్న రిస్క్‌లను, అనిశ్చిత పరిస్థితులను ఇది తగ్గిస్తుంది.

Twitter: ట్విట్టర్‭లో బ్లూ బ్యాడ్జ్ ఉంటే నెలకు 20 డాలర్లు చెల్లించాలంటూ వార్తలు.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం