భారీ బ్యాటరీ.. 4 కెమెరాలు : మీ బడ్జెట్‌లో Realme 5i వచ్చేసింది!

  • Published By: sreehari ,Published On : January 9, 2020 / 02:11 PM IST
భారీ బ్యాటరీ.. 4 కెమెరాలు : మీ బడ్జెట్‌లో Realme 5i వచ్చేసింది!

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం Realme ఒకటి. గడిచిన కొద్ది కాలంలోనే దేశీయ మార్కెట్లో సేల్స్ సునామీ సృష్టించింది. రూ.10 వేల లోపు స్మార్ట్ ఫోన్ బడ్జెట్‌లో అందించే స్మార్ట్ ఫోన్లలో రియల్ మి మరో కొత్త మోడల్ మార్కెట్లోకి విడుదల చేసింది. అదే.. Realme 5i మోడల్. 2020లో Realme కంపెనీ నుంచి భారత మార్కెట్లో రిలీజ్ అయిన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే కావడం విశేషం.

ప్రస్తుత మార్కెట్లో పోటీకి తగినట్టుగా ఎట్రాక్టీవ్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లతో తీసుకొచ్చింది. ఈ మోడల్ స్మార్ట్ ఫోన్‌లో 5,000mAh భారీ బ్యాటరీతో పాటు 6.52 అంగుళాల HD+ డిస్‌ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. పవర్ ఫుల్ ప్రాసెసర్ ఆన్ బోర్డుతో పాటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 AIE అమర్చారు.

ఇక Chipsetను 11nm ప్రాసెస్, క్లాక్ స్పీడ్ 2.0GHz ఆపరేటింగ్, గత జనరేషన్ చిప్ సెట్ ల కంటే గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ 20 శాతం మెరుగ్గా రన్ అవుతుంది. వెనకవైపు నాలుగు కెమెరాల (క్వాడ్ కెమెరా సెటప్)తో ఫొటోగ్రఫీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని రియల్ మి గ్యారెంటీ ఇస్తోంది.

అసలే.. పండగ సీజన్.. సంక్రాంతి బరిలో రియల్ మి 5i మోడల్ మరింత ఆకర్షణగా నిలుస్తోంది. జనవరి 15న తొలి సేల్ ప్రారంభం కానుంది. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం Filpkartలో మధ్యాహ్నాం 12 గంటల నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. సింగిల్ వేరియంట్ కావడంతో ఈ మోడల్ కు మరింత పోటీ ఉండే అవకాశం ఉంది. బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఉండే ఈ డివైజ్ ధర మార్కెట్లలో రూ.8వేల 999లకే లభ్యం కానుంది.

స్పెషిఫికేషన్లు – ఫీచర్లు ఇవే :
* 6.52 అంగుళాల HD+ (720 x 1600 ఫిక్సల్స్), వాటర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే
* Chipset : క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 AIE SoC
* RAM : సింగిల్ వేరియంట్ (4GB+64GB) 
* Storage : 64GB స్టోరేజీ వేరియంట్, MicroSD కార్డుతో Expand చేసుకోవచ్చు.
* Rear కెమెరాలు : వర్టికల్ క్వాడ్ కెమెరా సెటప్ 
* 12MP ప్రైమరీ కెమెరా, 8MP వైడ్ యాంగిల్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో షూటర్ 
* Front cameras: 8MP కెమెరా (వాటర్ డ్రాప్ నాచ్ ( సెల్ఫీల కోసం)
* Battery: 5000mAh భారీ బ్యాటరీ, Reverse Charging టెక్నాలజీ
* OS : ఆండ్రాయిడ్ 9.0, ColorOS 6.1 ఆపరేటింగ్ సిస్టమ్
* మే 2020 నుంచి Android 10, ColorsOS 7 Updateతో Upgrade కానుంది.