ఇండియాలో లాంచ్ : Realme XT వచ్చేసింది

  • Edited By: sreehari , September 13, 2019 / 07:43 AM IST
ఇండియాలో లాంచ్ : Realme  XT వచ్చేసింది

ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి నుంచి ఇండియన్ మార్కెట్లలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అదే.. రియల్‌మి XT మోడల్. శుక్రవారం మధ్యాహ్నాం 12.30 గంటలకు రియల్ మి లాంచింగ్ ఈవెంట్ జరిగింది. రియల్ మి ఎక్స్ టీ లాంచింగ్ ఈవెంట్‌ను కంపెనీ అధికారిక యూట్యూబ్ చానెల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చింది. రియల్ మి 5, రియల్ మి 5 ప్రో క్వాడ్ కెమెరా స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసిన కొన్ని వారాల్లోనే రియల్ మి XT మోడల్ ను భారత మార్కెట్లలోకి రిలీజ్ చేసింది.

రియల్ మి XT కంపెనీ మూడో క్వాడ్ కెమెరా ఫోన్. ఇందులో తొలిసారి 64MP కెమెరా సెన్సార్ ఆప్షన్ ఉంది. ప్రీమియం గ్లాస్ డిజైన్, VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్ డ్రాగన్ 712 SoC అదనపు ఫీచర్లు ఉన్నాయి. రియల్ మి XT స్మార్ట్ ఫోన్ మాత్రమే కాకుండా కొత్త రియల్ మి బడ్స్ వైర్ లెస్ ఇయర్ ఫోన్లను కూడా కంపెనీ రిలీజ్ చేసింది. వీటి ధర రూ.2 వేల నుంచి ఉంటుంది. 10,000mAh రియల్ మి పవర్ బ్యాంకు కూడా లాంచ్ చేసింది. 

రియల్ మి XT ధర ఎంత? ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది అనేది ఈవెంట్ లో ప్రకటిస్తారు. రియల్ మి ఎక్స్ సిరీస్ తో సక్సెస్ సాధించిన కంపెనీ కొత్త సిరీస్ లో భాగంగా రియల్ మి XT మోడల్ ఫోన్ తీసుకొచ్చింది. ఈ మోడల్ ఫోన్ ప్రారంభ ధర మార్కెట్లో రూ.20వేల నుంచి అందుబాటులో ఉండనుంది. రియల్ మి XT లో మూడు RAM వేరియంట్లు రిలీజ్ చేస్తుండగా.. అందులో 4GB ర్యామ్, 6GB, 8GB ర్యామ్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. టాప్ టైర్ వెర్షన్ ప్రీమియం ధరతో ఉండొచ్చు. 

స్పెషిఫికేషన్లు – ఫీచర్లు ఇవే :
* 6.4 అంగుళాల FHD+ (1080×2340) సూపర్ AMOLED డ్యెడ్రాప్ డిస్ ప్లే
* గొర్లిల్లా గ్లాస్ 5 (ఫ్రంట్ అండ్ బ్యాక్)
* రెండు గ్రేడియంట్ కలర్లు (వైట్ అండ్ బ్లూ)
* 64MP క్వాడ్ కెమెరా సెటప్
* శాంసంగ్ 64MP GW1 సెన్సార్ (ప్రైమరీ కెమెరా)
* 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్
* 2MP మ్యాక్రో లెన్స్ 
* 2MP పొర్టరైట్ కెమెరా 
* 2.3GHz స్నాప్ డ్రాగన్ 712 AIE SoC
* 4GB, 6GB, 8GB ర్యామ్, 128GB (ఇంటర్నల్ స్టోరేజీ)
* 4,000mAh బ్యాటరీ, VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ 
* ColorOS 6
* ఇన్- డిస్ ప్లే ఫింగర్ ఫ్రింట్ 
* న్యూ హైపర్ బోలా డిజైన్
* హైపర్ బూస్ట్ 2.0