పండుగ సీజన్ : రూ.15వేల లోపు Best స్మార్ట్ ఫోన్లు ఇవే

  • Published By: sreehari ,Published On : October 30, 2019 / 01:11 PM IST
పండుగ సీజన్ : రూ.15వేల లోపు Best స్మార్ట్ ఫోన్లు ఇవే

పండగ సీజన్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు ఉన్న కొత్త స్మార్ట్ ఫోన్లను కొనాలని స్మార్ట్ ఫోన్ ప్రియులు తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. దసరా, దీపావళి సందర్భంగా ఇప్పటికే కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్ కళకళలాడుతోంది. మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏయే ఫోన్లలో ఫీచర్లు బాగున్నాయి..

ధర ఎంత ఉంటుంది అని సెర్చ్ చేస్తున్నారా? రూ.15వేల లోపు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కొనాలని చూస్తున్నట్టయితే మార్కెట్లలో టాప్ 3 బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. మీకు నచ్చిన బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ఎంపిక చేసుకుని వెంటనే సొంతం చేసుకోండి. ఫోన్ల వివరాలు ఏంటో ఓసారి చూద్దాం.

Redmi Note 8 Pro :
చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ కంపెనీ నుంచి ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్.. Redmi Note 8 Pro. రెడ్ మి నోట్ 7 ప్రో తర్వాత మార్కెట్లో రిలీజ్ అయిన కొత్త రెడ్ మి నోట్ ఫోన్ ఇదే. ప్రస్తుతం.. మార్కెట్లో రూ.15వేల ధర లోపు లభ్యమ్యే స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి. ఈ ఫోన్.. ప్రీమియం, క్లాసీ డిజైన్ తో పాటు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఫ్రంట్, బ్యాక్ సైడ్, షియోమీ ఔరా డిజైన్ ఫిలోసఫీతో వచ్చింది.

ఇందులో ప్రత్యేక ఆకర్షణగా 64MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాలు ఉండగా.. ఫ్రంట్ సైడ్ లో సింగిల్ ఇమేజ్ సెన్సార్ ద్వారా ఈజీగా సెల్ఫీలు తీసుకోవచ్చు. రెడ్ మి నోట్ 8 ప్రో ధర రూ.14వేల 999గా మార్కెట్లో లభ్యం అవుతోంది. 

ఫీచర్లు – స్పెషిఫికేషన్లు ఇవే :
* 64MP ప్రైమరీ రియర్ కెమెరా
*  4 రియర్ కెమెరాలు 
* సింగిల్ ఇమేజ్ సెన్సార్ (సెల్ఫీలు)
* మీడియాటెక్ G90T గేమింగ్ చిప్ సెట్
* అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మ్యాక్రో లెన్స్
* డాట్ డ్రాప్ నాచ్, FHD +డిస్ ప్లే
* MIUI 10 ఆధారిత ఆండ్రాయిడ్ 9పై

Vivo Z1 Pro :
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో కంపెనీ నుంచి భారత మార్కెట్లలో రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లలో Vivo Z1 Pro ఒకటి. రూ.14వేల 990లకే మార్కెట్లలో లభ్యమయ్యే ఈ ఫోన్ ప్రారంభ ధరపై రూ.2వేల వరకు తగ్గించింది. దీంతో ప్రస్తుతం Z1 Pro స్మార్ట్ ఫోన్ ధర రూ.12వేల 990లకే లభ్యం అవుతోంది. వివో Z సిరీస్ లో వచ్చిన Vivo Z1 Pro తొలి స్మార్ట్ ఫోన్. స్పోర్ట్స్ యూనిక్ డిజైన్ గ్లాసీ ఫినీష్ తో వచ్చింది.

శక్తివంతమైన క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్ ఉండటంతో మల్టీటాస్కింగ్, గేమ్స్ ఈజీగా ఆడేందుకు వీలుంది. మంచి వెలుతురులో క్వాలిటీ ఫొటోలను తీసుకునేలా డిజైన్ అయింది. 32మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరాతో గ్రేట్ సెల్ఫీలు తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్.. ప్రైమరీ 16MP సెన్సార్, సెకండ్రీ 8MP సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్, మూడోది 2MP డెప్త్ సెన్సార్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. 

ఫీచర్లు- స్పెషిఫికేషన్లు ఇవే :
* క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్
* 32MP సెల్ఫీ కెమెరా షూటర్
* మూడు రియర్ కెమెరాలు (బ్యాక్)
* 16MP ప్రైమరీ కెమెరా సెన్సార్
* 8MP సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్
* 2MP డెప్త్ సెన్సార్     

Realme 5 Pro :
ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి నుంచి మార్కెట్లలో రిలీజ్ అయిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme 5 Pro ఒకటి. రూ.13వేల 999లకే లభ్యమయ్యే ఈ ఫోన్ మొత్తం 4 బ్యాక్ రియర్ కెమెరాలతో వచ్చింది. ప్రత్యేకించి క్వాడ్ కెమెరా సెటప్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రైమరీ కెమెరా 48MP సోనీ IMX586 సెన్సార్ ఉండగా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్లు ఎట్రాక్టీవ్ గా ఉన్నాయి. వెర్సటైల్ కెమెరా సెటప్ ఆధారంగా పనిచేసే ఈ నాలుగు కెమెరాలను సులభంగా హైరెజుల్యుషన్ మెయిన్ కెమెరా నుంచి అల్ట్రా వైడ్ యాంగిల్స్ లెన్స్ కు స్విచ్ అయ్యేలా డిజైన్ చేశారు.

తక్కువ వెలుతురు పరిస్థితుల్లో కూడా క్వాలిటీ ఫొటోలు తీసేలా నైట్ స్కేప్ మోడల్ ఆప్షన్ కూడా ఉంది. కీలక ఫీచర్లలో (స్నాప్ డ్రాగన్ 712చిప్ సెట్), కెమెరాలతో క్రిస్టల్ డిజైన్, ఫాస్ట్, సున్నితమైన పనితీరు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో పోటీదారుల్లో Mi A3, Vivo z1 Pro, గెలాక్సీ M30లతో పోలిస్తే ఆల్ రౌండ్ స్మార్ట్ ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ రన్ అయ్యే ఈ ఫోన్ ఇతర ఫోన్లతో పోలిస్తే బ్యాటరీ లైప్ అద్భుతంగా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. 

ఫీచర్లు – స్పెషిఫికేషన్లు ఇవే :
* క్రిస్టల్ డిజైన్, 4 బ్యాక్ కెమెరాలు
* క్వాడ్ కెమెరా సెటప్
* 48MP Sony IMX586 సెన్సార్
* 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్
* 2MP మ్యాక్రో లెన్స్ 
* 2MP డెప్త్ సెన్సార్
*  స్నాప్ డ్రాగన్ 712 చిప్ సెట్