జియోకు పోటీగా : ఎయిర్ టెల్ 4G Hotspot కొత్త ఆఫర్

డేటా సంచలనం రిలయన్స్ జియోకు పోటీగా ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ సంస్థ ఎయిర్ టెల్ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది.

  • Published By: sreehari ,Published On : May 8, 2019 / 01:19 PM IST
జియోకు పోటీగా : ఎయిర్ టెల్ 4G Hotspot కొత్త ఆఫర్

డేటా సంచలనం రిలయన్స్ జియోకు పోటీగా ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ సంస్థ ఎయిర్ టెల్ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది.

డేటా సంచలనం రిలయన్స్ జియోకు పోటీగా ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ సంస్థ ఎయిర్ టెల్ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. ఇండియాలో కొత్త Airtel 4G Hotspot యూజర్లకు కోసం నెలవారీ రెంటల్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.399తో రీఛార్జ్ చేయిస్తే చాలు.. నెలకు 50GB 4G హైస్పీడ్ డేటాను పొందవచ్చు. నెలలో 50GB డేటా పూర్తిగా వాడితే.. అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ డౌన్ స్పీడ్ 80Kbpsకు పడిపోతుంది.

ఈ కొత్త బండెల్ ఆఫర్ వివరాలు ఎయిర్ టెల్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. కొత్త యూజర్లు.. ఎయిర్ టెల్ 4G Hotspot  డివైజ్, డేటా వాడకం కోసం మరో ప్లాన్ ను సఫరేట్ గా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది.

నెలకు రూ.399 రీఛార్జ్ చేస్తే :
యూజర్లు రూ.399తో రీఛార్జ్ చేయించుకుంటే చాలు.. ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిన పనిలేకుండా రెండు బెనిఫెట్స్ ఒకేసారి పొందవచ్చు. ఎయిర్ టెల్ 4G హాట్ స్పాట్ డివైజ్ ధరను ఇటీవల కంపెనీ తగ్గించింది. ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ (amazon)వెబ్ సైట్ లో ఈ Hotspot Device కేవలం రూ.999కే లభిస్తోంది. నిజానికి ఈ ఎయిర్ టెల్ 4జీ హాట్ స్పాట్ డివైజ్ ఒరిజినల్ ధర రూ.1,500 వరకు ఉంది.

ఈ డివైజ్ వాడే యూజర్లు నెలకు రూ.399తో రీఛార్జ్ చేయించి రెంటల్ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లో మరో బెనిఫెట్ ఉంది.. నెలలో డేటా మిగిలిపోతే.. అది వచ్చే నెలకు క్యారీఫార్వర్డ్ అవుతుంది. ఈ డివైజ్ కు ఎయిర్ టెల్ SIM అవసరం. మొబైల్ ఫోన్లో SIM కార్డుకి రీఛార్జ్ చేసినట్టుగా అవసరమైనప్పుడు ఈ డివైజ్ సీమ్ కు కూడా రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. 

ఒకేసారి 10 డివైజ్ లతో కనెక్ట్  : 
మీరు ఉండే ప్రాంతంలో ఎయిర్ టెల్ 4G నెట్ వర్క్ అందుబాటులో లేకపోతే.. హాట్ స్పాట్ ఆటోమాటిక్ గా 3G నెట్ వర్క్ కు కన్ వర్ట్ అవుతుంది. ఈ ఎయిర్ టెల్ హాట్ స్పాట్ డివైజ్ ను ఒకేసారి 10 డివైజ్ లకు కనెక్ట్ చేసుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 6 గంటల వరకు పనిచేస్తుంది. ఈ డివైజ్ వాడకానికి సంబంధించి యూజర్లుకు ఎయిర్ టెల్ కొన్ని కండీషన్స్ అప్లయ్ అంటోంది. హాట్ స్పాట్ డివైజ్ లోని SIM కార్డును బయటకు తీస్తే మాత్రం.. బెనిఫెట్స్ వర్తించవని వెల్లడించింది. 

ఇప్పటికే రిలయన్స్ జియో.. JioFI M2S 4G Hotspot dongle ను ఆఫర్ చేస్తోంది. ఈ డివైజ్ ద్వారా జియో తమ యూజర్లకు ఎయిర్ టెల్ 4G హాట్ స్పాట్ రెంటల్ ప్లాన్ ఫీచర్లనే అందిస్తోంది. తమ కస్టమర్లకు జియో.. jioFI 4G హాట్ స్పాట్ డివైజ్ ను పాత జియో మోడమ్ లేదా dongleను ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ.999కే ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ద్వారా జియో యూజర్లు రూ.2వేల 200 వరకు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు.