రింగ్ టైమ్.. 25 సెకన్లకు తగ్గింపు : జియో బాటలో వోడాఫోన్-ఐడియా, ఎయిర్ టెల్  

  • Published By: sreehari ,Published On : October 2, 2019 / 09:42 AM IST
రింగ్ టైమ్.. 25 సెకన్లకు తగ్గింపు : జియో బాటలో వోడాఫోన్-ఐడియా, ఎయిర్ టెల్  

రిలయన్స్ జియో దెబ్బకు ఇతర టెలికం పోటీదారులైన వోడాఫోన్-ఐడియా, ఎయిర్ టెల్ దిగొచ్చాయి. ఔట్ గోయింగ్ కాల్స్ విషయంలో రింగ్ టైమ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. ప్రమాణాలు తగినట్టుగా రింగ్ టైం 30-సెకన్లకు పెంచాలని భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మాత్రం అప్పటివరకూ ఉన్న 20 సెకన్ల రింగ్ టైమ్ ను కేవలం 5 సెకన్లు మాత్రమే పెంచింది.

దీనిపై ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా నెట్ వర్క్‌లు తీవ్రంగా వ్యతిరేకించాయి. జియో 25 సెకన్ల కంటే ఎక్కువ పెంచేది లేదని తెగేసి చెప్పడటంతో మిగతా నెట్ వర్క్ లన్నీ జియో బాటలోకి వచ్చేశాయి. ఇప్పటివరకూ తమ నెట్ వర్క్ పై ఔట్ గోయింగ్ కాల్స్ రింగ్ టైమ్ వ్యవధి 30-45 సెకన్ల మధ్య ఉండగా.. జియో దెబ్బకు వోడాఫోన్-ఐడియా, ఎయిర్ టెల్ .. రింగ్ టైం వ్యవధిని 25 సెకన్లకు తగ్గించాయి. 

తామంతా రింగ్ టైం వ్యవధిని పెంచాలని డిమాండ్ చేస్తుంటే.. జియో తమ నెట్ వర్క్ పై ఔట్ గోయింగ్ కాల్స్ కు రింగ్ టైం తగ్గించడాన్ని తప్పుబట్టాయి. రింగ్ టైం విషయంలో జియోకు వ్యతిరేకంగా ట్రాయ్ కు లేఖ కూడా రాశాయి. ఇంటర్ కనెక్షన్ యూజ్ ఛార్జ్ (IUC) రూల్ మార్చటానికి జియో రింగ్ సమయాన్ని తగ్గించిందని ట్రాయ్ కు రాసిన లేఖలో ఎయిర్ టెల్ ఆరోపించింది. తక్కువ సమయం రింగ్ అంటే ఎక్కువ మిస్డ్ కాల్స్ అని టెలికాం ఆరోపించింది. దీనివల్ల జియో నెట్‌వర్క్‌కు ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తాయి. 

IUC చెల్లింపులను ప్రస్తుత టెలికంపెనీలకు తగ్గించటానికి అనుమతిస్తుందని తెలిపింది. 15-20 సెకన్ల సమయం అనేది ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ప్రమాణమని జియో ఈ ఆరోపణను తోసిపుచ్చింది. ఈ వివాదంపై సెప్టెంబర్ 6న జరిగిన TRAI సమావేశంలో ఎయిర్‌టెల్, వోడా ఐడియా, BSNL, MTNLలు ఎక్కువ మొత్తంలో కాల్స్ కు సమాధానం ఇవ్వడానికి కనీసం 30 సెకన్ల రింగ్ వ్యవధిని ఆమోదించాయి. ఇది వినియోగదారుల ఆసక్తి నెట్‌వర్క్ పనితీరును మెరుగుపరుస్తుందని అభిప్రాయపడ్డాయి.