Reliance Jio New Plans : రిలయన్స్ జియో కొత్త ప్లాన్లు ఇవే.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు.. రోజుకు డేటా ఎంతంటే?

Reliance Jio New Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టెలికాం ఆపరేటర్ తమ జియో యూజర్ల కోసం అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT బెనిఫిట్స్ అందిస్తోంది.

Reliance Jio New Plans : రిలయన్స్ జియో కొత్త ప్లాన్లు ఇవే.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు.. రోజుకు డేటా ఎంతంటే?

Reliance Jio new plan worth Rs 2,999 offers 365 days validity, 2GB data per day and more

Reliance Jio New Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టెలికాం ఆపరేటర్ తమ జియో యూజర్ల కోసం అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT బెనిఫిట్స్ అందిస్తోంది. అంతేకాదు.. వార్షిక ప్రీపెయిడ్ ప్యాక్‌ను కూడా అందిస్తోంది. అన్‌లిమిటెడ్ రోజువారీ డేటా బెనిఫిట్స్, నాన్‌స్టాప్ OTT స్ట్రీమింగ్, పాకెట్-ఫ్రెండ్లీ ధరలో అదనపు బెనిఫిట్స్‌తో ఈ ప్లాన్ ప్రత్యేకంగా అందిస్తోంది. రిలయన్స్ జియో కొత్త రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2.5GB డేటాను అందిస్తుంది.

ఈ ఆఫర్ Ajio, Netmeds Ixigo సహా మరిన్నింటి నుంచి కూపన్‌లతో పాటు 75GB అదనపు డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వన్-టైమ్ రీఛార్జ్ నెలవారీ రీఛార్జ్‌లను తగ్గించుకోవచ్చు. మీరు వార్షిక రీఛార్జ్ పొందాలని ప్లాన్ చేస్తుంటే అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT సబ్‌స్క్రిప్షన్, క్లౌడ్ స్టోరేజ్, మరిన్నింటిని పొందవచ్చు. మీరు రూ. 2,999 విలువైన Jio ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

జియో రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్‌ ఇదే :
జియో ప్లాన్ myjio.com, My Jio యాప్‌లో అందుబాటులో ఉంది. ఇతర సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్యాక్ బెనిఫిట్స్ ఇవే..

Reliance Jio new plan worth Rs 2,999 offers 365 days validity, 2GB data per day and more

Reliance Jio new plan worth Rs 2,999 offers 365 days validity, 2GB data per day and more

365 రోజుల వ్యాలిడిటీ :
– 2.5GB డేటా లిమిట్‌తో 912.5GB మొత్తం డేటాను పొందవచ్చు.
– ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు.
– రోజుకు 100 SMS పొందవచ్చు.
– 1 ఏడాది పాటు ఫ్రీ డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్.
– JioCinema, JioTV, JioSecurity మరియు JioCloud ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్.
– 75GB అదనపు డేటా, Ajio, Netmeds Ixigo, Reliance Digital, Jio Saavn Pro కూపన్లు పొందవచ్చు.

స్పెషల్ జియో 6వ వార్షికోత్సవ ఆఫర్ ప్లాన్‌తో పాటు ఇతర వార్షిక ప్రీపెయిడ్ ప్యాక్‌లను కూడా అందిస్తుంది. జియో ప్రస్తుతం రూ. 4199, రూ. 2,999, రూ. 2879, రూ. 2545 ధరలతో నాలుగు వార్షిక ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు గరిష్టంగా 3GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, OTT సబ్‌స్క్రిప్షన్, Jio యాప్ సర్వీసులకు ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

Read Also : Reliance Jio Plans : రిలయన్స్ జియో కొత్త ప్లాన్లు.. రోజూ 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్..!