డేటా ప్లాన్లు.. ఆఫర్లు ఇవే : Jio Fiber కనెక్షన్ తీసుకుంటున్నారా?

రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? ప్రస్తుతం జియో అందించే డేటా ప్లాన్లు, ఆఫర్లు వివరాలు పరిశీలిద్దాం. మీకు నచ్చిన డేటాప్లాన్ ఎంచుకుని జియో ఫైబర్ సర్వీసును యాక్సస్ చేసుకోవచ్చు. ముందుగా జియో ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఓసారి చూడండి.

  • Published By: sreehari ,Published On : August 27, 2019 / 07:32 AM IST
డేటా ప్లాన్లు.. ఆఫర్లు ఇవే : Jio Fiber కనెక్షన్ తీసుకుంటున్నారా?

రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? ప్రస్తుతం జియో అందించే డేటా ప్లాన్లు, ఆఫర్లు వివరాలు పరిశీలిద్దాం. మీకు నచ్చిన డేటాప్లాన్ ఎంచుకుని జియో ఫైబర్ సర్వీసును యాక్సస్ చేసుకోవచ్చు. ముందుగా జియో ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఓసారి చూడండి.

డేటా సంచలనం రిలయన్స్ జియో రాకతో టెలికం రంగంలో పెను మార్పులు సంభవించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దెబ్బకు ఇతర టెలికం పోటీదారుల్లో కలవరం పుట్టించింది. చౌకైన ధరకే డేటా ఆఫర్లు అందించడంతో వినియోగదారులంతా జియో బాట పట్టారు. ఇప్పుడు జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుతో వస్తోంది. మొబైల్ డేటాతో సంచలనం సృష్టించిన జియో ఫైబర్ సర్వీసుతో యూజర్లు మళ్లీ జియోకే జై కొడుతున్నారు. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ AGM సమావేశంలో సంస్థ చైర్మన్ ముఖేశ్ అంబానీ.. జియో ఫైబర్ సర్వీసును సెప్టెంబర్ 5న అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. FTTH సర్వీసులో భాగంగా హైస్పీడ్ ఇంటర్నెట్, జియో గిగాఫైబర్ కనెక్షన్ అందించనున్నట్టు తెలిపారు. 

అంతేకాదు.. జియో ఫైబర్ కనెక్షన్ యానివల్ ప్లాన్లు తీసుకున్న యూజర్లకు వెల్ కమ్ ఆఫర్ కింద  4K LED TV, 4K సెటప్ టాప్ బాక్స్ కూడా ఫ్రీగా ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించారు. ఫైబర్ కనెక్షన్ కు ఎలాంటి ఇన్ స్టాలేషన్ ఛార్జీలు లేవని, ఉచితంగా సర్వీసును అందించనున్నట్టు తెలిపింది. రిలయన్స్ జియో ఫైబర్ కనెక్షన్లు ప్రారంభం కాగా.. ఇప్పటివరకూ 1.5కోట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి దరఖాస్తులు అందాయి.

ఇండియాలో దేశవ్యాప్తంగా మొత్తం 1,600 నగరాల్లో 1.5 కోట్ల బిజినెస్ కనెక్షన్లు, 2 కోట్లకు పైగా నివాసాల్లో ఫైబర్ కనెక్షన్లు అందించడమే లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతోంది. కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు ఇంట్లో నుంచే దేశంలోని అన్ని టెలికం నెట్ వర్క్‌లకు  ఫ్రీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చునని ప్రకటించింది. ఇంటర్నేషనల్ కాలింగ్ టారిఫ్ కూడా చౌకైన ధరకే అందిస్తోంది.

టాప్ ప్రీమియం OTT అప్లికేషన్లు అందించే సర్వీసులకు కూడా జియో ఫైబర్ కనెక్షన్ ద్వారా సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? ప్రస్తుతం జియో అందించే డేటా ప్లాన్లు, ఆఫర్లు వివరాలు పరిశీలిద్దాం. మీకు నచ్చిన డేటాప్లాన్ ఎంచుకుని జియో ఫైబర్ సర్వీసును యాక్సస్ చేసుకోవచ్చు. ముందుగా జియో ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఓసారి చూడండి. 

1. జియో ఫైబర్ కనెక్షన్ పొందాలంటే : 
జియో ఫైబర్ కనెక్షన్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. జియో ఫైబర్ సర్వీసు కనెక్షన్ పొందాలంటే కస్టమర్లు జియో కంపెనీ వెబ్ సైట్ Jio Fiber New Connection విజిట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాగానే జియో ఫైబర్ కంపెనీ ఇంజినీర్ మీరు ఉండే ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత మీ ఇంట్లో జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసును ఇన్ స్టాల్ చేస్తారు. రెండు నుంచి మూడు గంటల్లో మీ ఫైబర్ కనెక్షన్ యాక్టివేట్ అవుతుంది. రిలయన్స్ జియో ప్రివ్యూ ఆఫర్ కింద జియో గిగాఫైబర్ సర్వీసు పొందాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2వేల 500 చెల్లించాల్సి ఉంటుంది. జియో రూటర్ కూడా ఉచితంగా పొందవచ్చు. 

2. ఇన్‌స్టాలేషన్ ఉచితం :
జియోఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్లకు ఉచితంగా ఇన్ స్టాలేషన్ చేయడం జరుగుతుంది. అంతేకాదు.. కస్టమర్లు ఉచితంగా ల్యాండ్ లైన్ కనెక్షన్ కూడా పొందవచ్చు. కొత్త కనెక్షన్ తీసుకున్న యూజర్లందరి కోసం కాంప్లిమెంటరీ జియోఫైబర్ ఇన్ స్టాలేషన్, కనెక్షన్ ఆఫర్ అందిస్తోంది. రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ మినహా అదనంగా ఇన్ స్టాలేషన్ చార్జీలు ఉండవని జియో ఒక ప్రకటనలో తెలిపింది. 

3. జియో ఫైబర్ డేటా ప్లాన్ల ధరలు ఇవే :
* జియో ఫైబర్ డేటా ప్లాన్లలో ప్రారంభ ధర నెలకు రూ.700 నుంచి రూ.10వేల వరకు ఉన్నాయి. 
* కస్టమర్లు నెలకు రూ.700తో డేటా ప్లాన్ తీసుకుంటే.. 100Mbps హైస్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.
* ప్రీమియం యూజర్లు రూ.10వేల డేటా ప్లాన్ తీసుకుంటే.. 1Gbps హైస్పీడ్ డేటా యాక్సస్ చేసుకోవచ్చు.