క్రెడిట్ కార్డు లోన్ల వాయిదాలు కట్టనక్కర్లేదా? క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

  • Published By: sreehari ,Published On : March 27, 2020 / 01:07 PM IST
క్రెడిట్ కార్డు లోన్ల వాయిదాలు కట్టనక్కర్లేదా? క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

క్రెడిట్ కార్డు వాయిదాల చెల్లింపులపై ఆర్థిక సంస్థలకు మూడు నెలల మారటోరియానికి అనుమతించినట్టు ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రభావంతో మధ్యతరగతి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలకు మూడు నెలల వరకు మారటోరియానికి అనుమతినిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. మార్చి 1 నుంచి మే 31 వరకు చెల్లించాల్సిన వాయిదా చెల్లింపులపై మూడు నెలల వరకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. జాతీయ, ప్రాంతీయ, గ్రామీణ, సహకార బ్యాంకులు, గృహ రుణాలు అందజేసే సంస్థలన్నీ పరిధిలోకి వస్తాయి. అయితే, ఈ బెనిఫిట్స్ కస్టమర్లకు బదిలీ చేయాలా? లేదా అనేది మాత్రం బ్యాంకులే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. 

ప్రస్తుతానికి ఈ సంస్థలన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా మందికి మారటోరియం తెలిసినప్పటి నుంచి కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్రెడిట్ కార్డు లోన్‌కు ఈ నెల వాయిదాను చెల్లించాలా లేదా బ్యాంకులు పరిగణిస్తాయో లేదో సందేహం వ్యక్తమవుతోంది. క్రెడిట్ కార్డు రుణ వాయిదాలకు ఇది వర్తిస్తుందా? అనేది అసలు ప్రశ్న తలెత్తుతోంది. ఈ మూడు నెలల కాలంలో చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు లోన్లపై వాయిదాలను మారటోరియం కాలం తర్వాత 3 నెలల నాటికి అటువంటి రుణాల తిరిగి చెల్లించే షెడ్యూల్ మారుతుంది. ఈ మూడు నెలల మారటోరియం వ్యవధిలో ఔట్ స్టాండింగ్ భాగంలో వడ్డీ పెరుగుతూనే ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. 

“అన్ని టర్మ్ లోన్లకు సంబంధించి (వ్యవసాయ టర్మ్ లోన్లు, రిటైల్, పంట రుణాలతో సహా), అన్ని వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులతో సహా), సహకార బ్యాంకులు, అఖిల భారత ఆర్థిక సంస్థలు, ఎన్బిఎఫ్సిలు (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా) (“రుణ సంస్థలు”) అన్ని వాయిదాల చెల్లింపుపై మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని మంజూరు చేయడానికి అనుమతి ఉంది ”అని ఆర్బీఐ తెలిపింది.

క్రెడిట్ కార్డు చెల్లింపులపై మారటోరియం వర్తిస్తుందా? లేదా?
క్రెడిట్ కార్డు లోన్లపై చెల్లింపులు టర్మ్ రుణాల కిందకు రావు. అందుకే మారటోరియం పరిధిలోకి రావని గుర్తించాలి.

ఈ నెల క్రెడిట్ కార్డు EMI చెల్లించాలి.. అకౌంట్లో నగదు కట్ అవుతుందా? 
చెప్పలేం.. అది బ్యాంకుల చేతుల్లో ఉంటుంది.. మారటోరియం అమలు చేసేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతించింది. అయితే దీనిపై నిర్ణయం మాత్రం బ్యాంకులదే ఉంటుంది. బ్యాంకులు ఒకవేళ ఈఎంఐలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల వాయిదా చెల్లించాల్చి వస్తుంది. 

ఈ నెల EMI వాయిదా పడిందో లేదో ఎలా తెలుసుకోవచ్చు?
దీనిపై ఆర్బీఐ ఇప్పటివరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. మార్గదర్శకాలు విడుదల చేస్తే తప్ప వాయిదా పడిందో లేదో తెలిసే అవకాశం ఉంటుంది. 

బ్యాంకులు ఈ ప్రాసెస్ ఎలా ప్రారంభిస్తాయంటే?
బ్యాంకులన్నీ కలిసి మారటోరియంపై చర్చిస్తాయి. బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకుంటాయి. మారటోరియం ఆమోదిస్తే ఆ విషయాన్ని వినియోగదారులకు తెలియజేస్తాయి.

బ్యాంకు EMI వాయిదా వేస్తే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుందా?
అంటే.. లేదనే చెప్పాలి. మీ క్రెడిట్ స్కోరుకు ఇబ్బందేమీ ఉండదని గ్రహించాలి. ఎందుకంటే.. ఈ నెల వాయిదాను మూడు నెలలకు మార్చడం జరుగుతుంది మాత్రమే.. అప్పటివరకూ పడే వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. 

ఆర్బీఐ చేసేది వాయిదానా లేదా రద్దా? తెలియడం లేదు :
వాయిదా మాత్రమే.. రద్దు మాత్రం కాదు.. ఎందుకంటే.. బ్యాంకులు మారటోరియం ఆమోదిస్తే మీరు చెల్లించాల్సిన ఇన్ స్టాల్ మెంట్స్ టెర్మ్ ప్రస్తుతానికి తగ్గి మూడు నెలలు పెరుగుతుందని గుర్తించాలి. 

మారటోరియం అసలు, వడ్డీ రెండింటిపై ఉంటుందా?
అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే.. అసలు, వడ్డీ రెండింటిపై మారటోరియం వర్తిస్తుంది. చెల్లించాల్సిన ఇన్‌స్టాల్ మెంట్ వాయిదా వేసే మొత్తం రుణంలో అసలు, వడ్డీ రెండు కలిపే ఉంటాయి.