సోషల్ మీడియాలో పుకార్లు : ఆ 9 బ్యాంకులు ఎత్తివేతపై ఆర్బీఐ క్లారిటీ 

కమర్షియల్ బ్యాంకులను మూసివేస్తున్నారంటూ కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం 9 వాణిజ్య బ్యాంకులు మూతపడనున్నట్టు వార్తలు వచ్చాయి.

  • Published By: sreehari ,Published On : September 25, 2019 / 12:58 PM IST
సోషల్ మీడియాలో పుకార్లు : ఆ 9 బ్యాంకులు ఎత్తివేతపై ఆర్బీఐ క్లారిటీ 

కమర్షియల్ బ్యాంకులను మూసివేస్తున్నారంటూ కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం 9 వాణిజ్య బ్యాంకులు మూతపడనున్నట్టు వార్తలు వచ్చాయి.

కమర్షియల్ బ్యాంకులను ఎత్తివేస్తున్నారంటూ కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం 9 వాణిజ్య బ్యాంకులు మూతపడనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) తీవ్రంగా ఖండించింది. ఎలాంటి కమర్షియల్ బ్యాంకులు మూతపడటం లేదని సెంట్రల్ బ్యాంకు క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో బ్యాంకుల ఎత్తివేతపై వస్తున్న వార్తలను ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ ఖండించారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే సోషల్ మీడియాలో ఇలాంటి సందేశాలను వైరల్ చేయడం దురదృష్టకరమన్నారు. 

‘ఆర్బీఐ.. కొన్ని కమర్షియల్ బ్యాంకులను మూసివేస్తున్నట్టు కొన్ని రకాల సోషల్ మీడియాల్లో వచ్చిన నివేదికలు అబద్ధం’ అని సెంట్రల్ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ.. 9 బ్యాంకులు శాశ్వతంగా మూసివేయనుందని, వెంటనే ఖాతాదారులు తమ అకౌంట్లలోని డబ్బులును వెంటనే విత్ డ్రా చేసుకోవాల్సిందిగా వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో తప్పుడు సందేశాలు వైరల్ అవుతున్నాయి. ‘ఎలాంటి PSB బ్యాంకులను మూసివేసే ప్రశ్నే లేదు. ఆ కథనాలన్నీ కల్పితం. కస్టమర్లకు నాణ్యమైన సర్వీసులను అందించే దిశగా ప్రభుత్వం.. సంస్కరణలతో PSBలను బలోపేతం చేస్తోంది’ అని కుమార్ ట్వీట్ చేశారు. 

ముంబై ఆధారిత పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (PMC)లోని లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఇలాంటి తప్పుడు సందేశాలు వైరల్ అవుతున్నాయని అన్నారు. ఆ సందేశాల్లో పేర్లు గల బ్యాంకులను.. ఇతర బ్యాంకులతో విలీనం చేయడంగానీ లేదా విలీనం ప్రక్రియలో కూడా లేవని ఆయన స్పష్టం చేశారు. ఆగస్టు నెలలో ప్రభుత్వం.. 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను మొత్తం 4 బ్యాంకులుగా విలీనం చేసింది.

అందులో ఒరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్, యూనైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం అయ్యాయి. సిండికేట్ బ్యాంకు కూడా కెనరా బ్యాంకులో ఒక భాగమైంది. ఇక ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు యూనియన్ ఆఫ్ బ్యాంకుతో విలీనం అయ్యాయి. ఇండియన్ బ్యాంకుతో అలహాబాద్ బ్యాంకు విలీనం అయింది. ఇదివరకే బ్యాంకు ఆఫ్ బరోడాలో డెనా బ్యాంకు, విజయ బ్యాంకులను ప్రభుత్వం విలీనం చేసింది.