ఇంటర్నెట్ షట్‌డౌన్ పాలసీ రివ్యూ చేయాల్సిందే! : COAI డిమాండ్

  • Published By: sreehari ,Published On : January 1, 2020 / 12:13 PM IST
ఇంటర్నెట్ షట్‌డౌన్ పాలసీ రివ్యూ చేయాల్సిందే! : COAI డిమాండ్

పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తాయి. అసోంలో ఆందోళనలతో అట్టుడికిపోయింది. CAA, NRCల అమలును నిరసిస్తూ రోడ్లపై ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో కూడా సీఏఏ నిరసన సెగ తగిలింది.

ఆన్ లైన్‌లో CAA చట్టాన్ని విమర్శిస్తూ ఆందోళనలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ షట్ డౌన్ పాలసీ తీసుకొచ్చింది. ఆందోనళలు జరిగే ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసింది. దీంతో టెలికం కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మొబైల్ ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోవడంతో భారతీయ సెల్యూలర్ సర్వీసు ప్రొవైడర్లు గంటకు రూ.2.45 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటర్నెట్ షట్ డౌన్ పాలసీని టెలికం కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. 

ఇంటర్నెట్ షట్ డౌన్ సరికాదు :
సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI), భారతీయ టెలికం పరిశ్రమకు చెందిన అపెక్స్ విభాగం సైతం మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది అసొసియేషన్ రాజన్ మాథ్యూస్ (రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా) మాట్లాడుతూ… ఇంటర్నెట్ షట్ డౌన్ పాలసీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం.. టెలికం పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.

ఇంటర్నెట్ షట్ డౌన్ పాలసీని ప్రభుత్వం వెంటనే రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ‘ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం ఇది తొలిసారి కాదు.. దేశంలో ఆందోళనలు చెలరేగినప్పుడు లేదా అశాంతి నెలకొన్న సమయంలో వాటి తీవ్రతను అదుపు చేసేందుకు గతంలో కూడా ప్రభుత్వం ఎన్నోసార్లు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసింది. దీనిపై కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖను మేం సంప్రదించాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ వాడకుండా షట్ డౌన్ చేయడం సరికాదు’ అని మాథ్యూస్ చెప్పారు. 

2014లో 6 సార్లు.. 2019లో 109 సార్లు :
ఈ పాలసీ విధానాన్ని అవలంభించరాదని పరిశ్రమలో ప్రధాన టెలికం కంపెనీలన్నీ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఈ అంశాన్ని ప్రభుత్వంతో చర్చించేంత వరకు తీసుకెళ్తామన్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అయిన తొలి ఏడాది నుంచి ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం పెరిగిపోయింది. 2014తో  పోలిస్తే ఇంటర్నెట్ 6 సార్లు మాత్రమే షట్ డౌన్ చేయగా.. 2019లో ప్రభుత్వం ఏకంగా 109 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ చేసినట్టు ఇంటర్నెట్ షట్ డౌన్ ట్రాకర్ రిపోర్టు తెలిపింది. ఇంటర్నెట్ షట్ డౌన్ అయ్యే ప్రాంతాల్లో జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రజాస్వామ్యంలో సుదీర్ఘకాలంగా ఇంటర్నెట్ షట్ డౌన్ అయినట్టు రికార్డు అయింది. 

జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయి జనవరితో ఐదో నెలలోకి ఎంటర్ అయింది. ఇటీవలే కశ్మీర్‌లో స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ముందుగానే ఆగస్టు 5, 2019న ప్రభుత్వం ఇంటర్నెట్ షట్ డౌన్ మొదలైంది. అక్టోబర్ 14న లోయయ ప్రాంతాల్లో కొన్ని చోట్ల పోస్టు పెయిడ్ కనెక్షన్లను మాత్రం రీస్టోర్ చేసింది.

కానీ, అక్టోబర్ 20న దేశీయ టెలికం తరపున అపెక్స్ అడ్వైజరీ కౌన్సిల్ COAIకు మద్దతుగా నిలిచింది. ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ హోం మంత్రిత్వ శాఖలోని హోం కార్యదర్శి అజయ్ కుమార్ భళ్లాకు లేఖను రాసింది. ప్రీపెయిడ్ కనెక్షన్లు నిలిచిపోయినా పోస్టు పెయిడ్ కనెక్షన్లను మాత్రం రీస్టోర్ చేసేలా నిర్ణయం తీసుకోవాలని కౌన్సిల్ పిలుపునిచ్చింది. ఆ తర్వాత ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ కనెక్షన్లపై ఆంక్షలను ఎత్తివేయాలని మంత్రిత్వశాఖకు కౌన్సిల్ అభ్యర్థించింది. కానీ, మంత్రిత్వ శాఖ స్పందించలేదు.  

తాత్కాలిక సస్పెన్షన్ ప్రొవిజన్ :
ఇంటర్నెట్‌ను నిలిపివేయడానికి.. ప్రభుత్వం 2017 తాత్కాలిక సస్పెన్షన్ (పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీ) నిబంధనలపై ఆధారపడింది. ఈ నిబంధనలను ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885లో ఆగస్టు 2017 నాటి గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా చేర్చడం జరిగింది. ఈ నిబంధనలతో ఇంటర్నెట్ షట్ డౌన్‌పై తుది అధికారం, బాధ్యతను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని హోం సెక్రటరీతో లేదా హోం శాఖకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శితో లేదా భారత ప్రభుత్వానికి ఉమ్మడి కార్యదర్శి హోదాలో లేని అధికారికి ఉంటాయి.  

డిసెంబర్ 19న నగరంలో CAAకు వ్యతిరేకంగా నిరసనలతో ప్రభుత్వం తొలిసారిగా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేసింది.  ఇంటర్నెట్ షట్ డౌన్ కావడంతో గంటకు భారతీయ టెలికాం కంపెనీలు 2.45 కోట్ల రూపాయల నష్టాన్ని కోల్పోతున్నాయని COAI అంచనా వేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వు తర్వాత ఈ రంగం నష్టాలను ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్న సమయంలో కంపెనీలను రెట్టింపుగా దెబ్బతీస్తుందని పేర్కొంది. అక్టోబర్ 13 బిలియన్ డాలర్ల ఓవర్‌డ్యూ లైసెన్సింగ్ ఫీజు చెల్లించాలని టెలికాం కంపెనీలను కోరింది.

‘ఆదేశాలకు కట్టుబడి ఉండటమే విధానం. మా లైసెన్సులు సార్వభౌమ ప్రభుత్వంలో ఉంటే మేము సార్వభౌమ ఉత్తర్వులను ధిక్కరించలేము. మేము ఒక ఉత్తర్వుతో ఏకీభవించకపోయినా, మేము దానిని పాటించాలి. ఈ విధానం వ్యయ-ప్రయోజన విశ్లేషణను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి’అని మాథ్యూస్ అన్నారు. సాపేక్షంగా పేద రాష్ట్రాల్లో భద్రతా మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మెరుగైన ఇంటెలిజెన్స్ సేకరణలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. సామాన్య ప్రజలపై ఇంటర్నెట్ షట్ డౌన్ ప్రభావాన్ని తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.