Revolt RV400: రివోల్డ్‌ ఆర్‌వీ 40.. క్షణాల్లోనే ఔట్ ఆఫ్‌ స్టాక్‌!

రివోల్ట్​ ఎలక్ట్రిక్​ బైక్​లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఆ​ర్​వీ 400 మోడల్ అమ్మకాల్లో దుమ్మురేపుతుంది. జూన్ నెలలో తొలిసారి ఈ బైక్ అమ్మకానికి పెట్టినపుడు రెండు గంటల్లోనే అమ్మకానికి పెట్టిన బైక్​లన్నీబుక్ అయిపోయాయి. దీంతో బుకింగ్​ను ఆపేసింది రివోల్ట్​. ఆ విడతలోనే రూ.50కోట్ల విలువైన బైక్​లకు బుకింగ్స్ వచ్చాయని కంపెనీ వెల్లడించింది.

Revolt RV400: రివోల్డ్‌ ఆర్‌వీ 40.. క్షణాల్లోనే ఔట్ ఆఫ్‌ స్టాక్‌!

Revolt Rv400 (1)

Revolt RV400: రివోల్ట్​ ఎలక్ట్రిక్​ బైక్​లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఆ​ర్​వీ 400 మోడల్ అమ్మకాల్లో దుమ్మురేపుతుంది. జూన్ నెలలో తొలిసారి ఈ బైక్ అమ్మకానికి పెట్టినపుడు రెండు గంటల్లోనే అమ్మకానికి పెట్టిన బైక్​లన్నీబుక్ అయిపోయాయి. దీంతో బుకింగ్​ను ఆపేసింది రివోల్ట్​. ఆ విడతలోనే రూ.50కోట్ల విలువైన బైక్​లకు బుకింగ్స్ వచ్చాయని కంపెనీ వెల్లడించింది. ఇక ఇప్పుడు రెండోసారి బుకింగ్స్ పెట్టినా ఇప్పుడు కూడా అదే పరిస్థితి.

Revolt Rv400

Revolt Rv400

బుకింగ్స్‌ ఓపెన్‌ చేసిన రెండోసారి కూడా క్షణాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలను సాధించిందని కంపెనీ వెల్లడించింది. మొదటి బుకింగ్స్‌లోనే రికార్డు అమ్మకాలను సాధించిన ఎలక్ట్రిక్ బైక్‌ రివోల్ట్‌ ఆర్‌వీ 400 బుకింగ్‌లను తిరిగి ప్రారంభించిన నిమిషాల్లోనే ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌గా నిలిచిందని కంపెనీ తెలిపింది. తమ బైక్స్‌ వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం నాలుగు నెలలు ఉండగా.. ప్రస్తుతం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, తద్వారా వెయిటింగ్ టైంను తగ్గించడానికి కంపెనీ తీవ్రంగా కృషి చేస్తున్నట్టు వెల్లడించింది.

Revolt Rv400

Revolt Rv400

ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై,అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో కంపెనీ బుకింగ్ ప్రారంభించింది. ఎలక్ట్రిక్​ టూవీలర్స్​ అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని సబ్సిడీలు ప్రకటించడంతో రివోల్ట్ ఆర్​వీ 400 బైక్​ ధరలు భారీ తగ్గాయి. ఈ బైక్​లకు డిమాండ్ విపరీతంగా పెరిగేందుకు ఇది ఓ కారణంగా ఉంది. సబ్సిడీలు లభించడంతో ఆర్​వీ 400 బైక్ ధరను రివోల్ట్ రూ.28,201 మేర తగ్గించి రూ.1,19,000 ధరకే బుకింగ్​కు పెట్టింది. దీంతో వినియోగదారులు పోటీపడి మరీ బుక్​ చేసుకోవడంతో రెండు గంటల్లోనే బుకింగ్స్ పూర్తయ్యాయి.