రూ.10లక్షల కోట్లకు చేరిన M-cap : తొలి భారతీయ కంపెనీగా RIL రికార్డు

  • Published By: sreehari ,Published On : November 28, 2019 / 10:49 AM IST
రూ.10లక్షల కోట్లకు చేరిన M-cap : తొలి భారతీయ కంపెనీగా RIL రికార్డు

స్టాక్ మార్కెట్లు జోరు మీదున్నాయి. దేశీయ మార్కెట్ సూచీలు ఒక్కసారిగా పైకి ఎగియడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లు కూడా అమాంతం పైకి ఎగసాయి. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని RIL కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10లక్షల కోట్ల మార్క్ ను చేరింది. దీంతో RIL తొలి భారతీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఆయిల్ కంపెనీల నుంచి టెలికం కంపెనీల వరకు అన్ని మార్కెట్ల క్యాపిటలైజేషన్ (M-CAP) రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. రిలయన్స్ కంపెనీ షేర్లు భారీగా పెరగడంతో గురువారం (నవంబర్ 28, 2019) BSEపై ఉదయం ట్రేడింగ్ సమయంలో RIL మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.02 లక్షల కోట్లకు చేరింది. 

Read Also :  అదరహో అంబానీ : టాప్ 6 క్లబులోకి రిలయన్స్.. రికార్డు బ్రేక్

కంపెనీ స్టాక్ 0.73శాతంగా పెరిగి రికార్డు స్థాయిలో గరిష్టంగా రూ.1,581.25 (ఇంట్రా-డే)కు చేరుకుంది. తద్వారా తొలి భారతీయ కంపెనీగా  RIL రికార్డు సృష్టించింది. ఆయిల్, టెలికం, రిటైల్ రంగం సహా వివిధ రంగాల్లో అగ్రగామిగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మార్కెట్ క్యాపిటలైజేషన్ నవంబర్ 20న రూ.9.5 లక్షల కోట్లతో మైలు రాయిని చేరిన సంగతి తెలిసిందే. ఈ రికార్డును బ్రేక్ చేసిన తొలి భారతీయ కంపెనీ కూడా RIL కావడం విశేషం. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ర్యాలీలో సుమారు 4శాతంతో లైఫ్ టైమ్ గరిష్ట స్థాయికి (ఇంట్రా-డే)తో రూ.1,571 మార్క్ వద్ద ట్రేడ్ అయ్యాయి. తద్వారా రూ.10లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ స్థాయికి అతిచేరువలో రిల్ నిలిచింది. 

రెండో అతిపెద్ద దేశీయ కంపెనీగా TCS
2018, ఆగస్టులో RIL కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8లక్షల కోట్ల మార్క్‌ దాటేసిన తొలి దేశీయ కంపెనీగా రికార్డు సృష్టించింది. RIL కంపెనీ తర్వాత మరో టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ (7,91,115.27) రూ. 7.91 లక్షల కోట్లతో రెండో దేశీయ అతిపెద్ద మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కంపెనీగా నిలిచింది. ఆ తర్వాత HDFC బ్యాంకుతో సహా మార్కెట్ క్యాపటిలైజేషన్ రూ.6,97,761.76 కోట్లుగా నమోదైంది.

ఇక హిందుస్థాన్ అన్ లివర్ లిమిటెడ్ (రూ.4,40,961.39 కోట్లు), HDFC (రూ.3,82,291.21 కోట్లు)గా నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ RIL స్టాక్ 34శాతానికి పైగా లాభాలు సాధించింది. కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గణంకాలు.. రోజువారీ స్టాక్ ధరల కదలికలను అనుసరించి మారుతుంటాయి. 

మరోవైపు డిసెంబర్ 1 నుంచి మొబైల్ టారిఫ్స్ రేట్లు పెరగనున్న నేపథ్యంలో రిలయన్స్ జియో కూడా తమ మొబైల్ ఫోన్ కాల్స్, డేటా ఛార్జీలు పెరగనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. రిలయన్స్ జియోతో పాటు ఇతర టెలికం కంపెనీలైన భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా కూడా తమ మొబైల్ టారిఫ్ రేట్లను పెంచనున్నాయి. 
Read Also : బ్రేకింగ్ : డిసెంబర్ 1 నుంచి మొబైల్ టారిఫ్ రేట్లు పెంపు