పెరుగుతున్న పెట్రోల్ ధరలు

  • Published By: madhu ,Published On : November 20, 2019 / 02:51 AM IST
పెరుగుతున్న పెట్రోల్ ధరలు

పెట్రోల్ ధరలు ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 2019, నవంబర్ 19వ తేదీ మంగళవారం మరింత అధికమయ్యాయి. ఢిల్లీలో లీటర్ ధర రూ. 15 పైసలకు చేరుకుని..రూ. 74.20 స్థాయికి ఎగబాకింది. వారం రోజులుగా యథాతథంగా ఉన్న డీజిల్ ధర 5 పైసలు అధికమై..రూ. 65.84కు చేరుకుంది. గత పది రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 1.70కి పైగా అధికమైంది. దీంతో వాహనదారుల జేబుకు చిల్లు పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌‌లో క్రూడాయల్ ధరలు రోజుకింత పెరుగుతుండడంతో పాటు డాలర్‌‌తో పోలిస్తే..రూపాయి మారకం వివుల పడిపోవడంతో దేశ వ్యాప్తంగా ధరలను పెంచుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 16 పైసలు ఎగబాకి..రూ. 78.96కి చేరుకుంది. డీజిల్ ధర 5 పైసలు పెరిగి..రూ. 71.85 వద్ద ముగిసింది. 
Read More : పెళ్ళిచేసుకోండి అప్పులిస్తాం : బజాజ్ ఫిన్ సర్వ్

నగరం పెట్రోల్ డీజిల్
చెన్నై రూ. 77.13 రూ. 69.59
ఢిల్లీ రూ. 74.20 రూ. 65.84
కోల్ కతా రూ. 76.89 రూ. 68.25
ముంబై రూ. 79.86 రూ. 69.06
బెంగళూరు రూ. 76.74 రూ. 68.08
హైదరాబాద్ రూ. 78.96 రూ. 71.85
విశాఖపట్టణం రూ. 77.41 రూ. 70.15