Royal Enfield Classic 350 : కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ బైక్ కొనాలంటే ఎంత చెల్లించాలో తెలుసా?

Royal Enfield Classic 350 : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? బుల్లెట్ బండ్లకు రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్.. ( Royal Enfield).. ప్రతి బైకు కొనుగోలుదారు మనస్సులో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు ఎప్పటికైనా కొనాలని కోరిక ఉంటుంది.

Royal Enfield Classic 350 : కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ బైక్ కొనాలంటే ఎంత చెల్లించాలో తెలుసా?

Royal Enfield Classic 350 _ Planning to buy this motorcycle_ This is how much you will have to pay

Royal Enfield Classic 350 : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? బుల్లెట్ బండ్లకు రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్..(Royal Enfield).. ప్రతి బైకు కొనుగోలుదారు మనస్సులో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు ఎప్పటికైనా కొనాలని కోరిక ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అనేక సెగ్మెంట్లలో అందుబాటులో ఉంది. అందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ 350cc మోటార్‌సైకిల్ సెగ్మెంట్ విషయానికి వస్తే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ Classic 350 కొనుగోలుదారులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. క్లాసిక్ 350 టైమ్‌లెస్ క్లాసిక్ డిజైన్ అమితంగా కొనుగోలుదారులను ఆకట్టుకుంటుంది. ఒకవేళ మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ముందుగా మీరు ఈ బైక్ కోసం ఎంత చెల్లించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

⇒ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వేరియంట్లు :
క్లాసిక్ 350 రెండు వేరియంట్లలో వస్తుంది. అందులో సింగిల్ ఛానల్ ABS, డ్యూయల్ ఛానల్ ABS ఉన్నాయి.

⇒ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కలర్ ఆప్షన్లు :
క్లాసిక్ 350 కలర్ ఆప్షన్లు చాలావరకూ బాగున్నాయి. సింగిల్ ఛానల్ ABS వేరియంట్‌కు 6 కలర్ ఆప్షన్లు ఉండగా.. డ్యూయల్ ఛానెల్ ABS వేరియంట్‌కు 9 కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

⇒ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధరలివే :
ఈ కింది లిస్టులో కలర్, వేరియంట్ వారీగా క్లాసిక్ 350 ధరలు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉన్నాయి.

Read Also : Royal Enfield Bullet : రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల జోరు.. ఫిబ్రవరిలో పెరిగిన 21శాతం వృద్ధి..!

(Redditch) రెడ్ సింగిల్ ఛానల్ ABS – రూ. 1,90,092
(Redditch) గ్రే సింగిల్ ఛానల్ ABS – రూ. 1,90,092
(Redditch) సేజ్ గ్రీన్ సింగిల్ ఛానల్ ABS – రూ. 1,90,092
(Halcyon) బ్లాక్ సింగిల్ ఛానల్ ABS – రూ. 1,92,890
(Halcyon) గ్రీన్ సింగిల్ ఛానల్ ABS – రూ. 1,92,890
(Halcyon) గ్రే సింగిల్ ఛానల్ ABS – రూ. 1,92,890
(Halcyon) బ్లాక్ డ్యూయల్ ఛానెల్ ABS – రూ. 1,98,971

Royal Enfield Classic 350 _ Planning to buy this motorcycle_ This is how much you will have to pay

Royal Enfield Classic 350 _ Planning to buy this motorcycle

(Halcyon) గ్రీన్ డ్యూయల్ ఛానెల్ ABS – రూ. 1,98,971
(Halcyon) గ్రే డ్యూయల్ ఛానెల్ ABS – రూ. 1,98,971
సిగ్నల్స్ డెసర్ట్ సాండ్ డ్యూయల్ ఛానల్ ABS – రూ. 2,10,385
సిగ్నల్స్ మార్ష్ గ్రే డ్యూయల్ ఛానల్ ABS – రూ. 2,10,385
డార్క్ స్టెల్త్ బ్లాక్ డ్యూయల్ ఛానల్ ABS – రూ. 2,17,588
డార్క్ గన్‌మెటల్ గ్రే డ్యూయల్ ఛానెల్ ABS – రూ. 2,17,588
(Chrome) రెడ్ డ్యూయల్ ఛానల్ ABS – రూ. 2,21,297
(Chrome) బ్రాంజ్ డ్యూయల్ ఛానెల్ – రూ. 2,21,297

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మైలేజ్ ఎంతంటే? :
ఈ మోటార్‌సైకిల్ 349cc, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-0il కూల్డ్, EFI ఇంజిన్‌తో నడుస్తుంది. 20.2bhp గరిష్ట శక్తితో పాటు 27Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ స్టేబుల్ మెష్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మైలేజ్ లీటరుకు 36.2కిలోమీటర్లుగా మైలేజ్ ఇస్తుంది.

Read Also : Royal Enfield Super Meteor 650: భారత్ మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఖ‌రీదైన బైక్ వ‌చ్చేసింది.. ధ‌ర‌, బైక్ ప్ర‌త్యేక‌లు ఇవే..