Nourishyou: నరిష్యులో పెట్టుబడులు పెట్టడమే కాకుండా మిల్లెట్ మిల్క్‌ను విడుదల చేసిన నటి సమంత
గత కొద్ది కాలంగా నరిష్యు ఉత్పత్తులను తింటుండటం వల్ల ఆ సంస్ధలో పెట్టుబడులు పెట్టాను. క్వినోవా, చియా సీడ్స్ వంటి సూపర్ ఫుడ్స్‌ను ఇండియాకు తీసుకురావడంలో వారు పోషించిన పాత్ర, స్థానికంగా వారు ఎదిగిన తీరు, తృణధాన్యాల ఆధారిత క్లీన్ లేబుల్ వీగన్ సూపర్‌ఫుడ్స్ కోసం వారి ప్రొడక్ట్ రోడ్‌మ్యాప్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి

Samantha invested in Nourishyou
Nourishyou: దేశీయంగా అభివృద్ధి చెందిన సూపర్‌ఫుడ్ స్టార్టప్, నరిష్యు కంపెనీలో సుప్రసిద్ధ నటి సమంత రుత్ ప్రభు పెట్టుబడులు పెట్టారు. దేశంలో క్వినోవా, చియా సీడ్స్‌ను విక్రయించిన సంస్ధగా ఆ సంప్రదాయం కొనసాగిస్తూ స్ధానికంగా సేకరించిన, సస్టెయినబల్ సూపర్‌ఫుడ్స్‌ను నరిష్యు ప్రోత్సహిస్తోంది. ఇందుకు ప్రోత్సాహకంగానే పెట్టుబడి పెట్టినట్లు సమంత రుత్ ప్రభు వెల్లడించారు. గతంలో కొంత మంది ప్రముఖులు ఇందులో పెట్టుబడులు పెట్టారు.
Aha Godari : శ్రీరామనవమి కానుకగా.. ఆహాలో ‘గోదారి’ పేరుతో స్పెషల్ డాక్యుమెంటరీ..
నరిష్యులో పెట్టుబడులు గురించి సమంత్ రుత్ ప్రభు మాట్లాడుతూ ‘‘గత కొద్ది కాలంగా నరిష్యు ఉత్పత్తులను తింటుండటం వల్ల ఆ సంస్ధలో పెట్టుబడులు పెట్టాను. క్వినోవా, చియా సీడ్స్ వంటి సూపర్ ఫుడ్స్‌ను ఇండియాకు తీసుకురావడంలో వారు పోషించిన పాత్ర, స్థానికంగా వారు ఎదిగిన తీరు, తృణధాన్యాల ఆధారిత క్లీన్ లేబుల్ వీగన్ సూపర్‌ఫుడ్స్ కోసం వారి ప్రొడక్ట్ రోడ్‌మ్యాప్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వినియోగదారుల ఆరోగ్యంతో పాటుగా భూమ్మీద కూడా సానుకూల ప్రభావం తీసుకువచ్చేలా విలువను నరిష్యు సృష్టించనుందని నేను నమ్ముతున్నాను. వ్యాపారం పట్ల వారి వినూత్నమైన, స్ధిరమైన విధానంలో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు.
Hyderabad: కొవిడ్ తర్వాత భారీగా పెరిగిన వీసా దరఖాస్తులు.. గతేడాదితో పోలిస్తే 129% పెరుగుదల
పెట్టుబడి పెట్టిన అనంతరం సమంత చేతుల మీదుగా మొట్టమొదటి మొక్కల ఆధారిత, వీగన్, లాక్టోస్ ఫ్రీ పాల ప్రత్యామ్నాయం మిల్లెట్ మిల్క్‌ను నరిష్యు యాజమాన్యం విడుదల చేయించింది. ఈ నూతన ఉత్పత్తి ద్వారా ప్రత్యామ్నాయ డెయిరీ విభాగంలోకి కంపెనీ ప్రవేశించింది.