Samsung Galaxy M13 Series : శాంసంగ్ గెలాక్సీ M13 5G సిరీస్ వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతంటే?

సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి M13 సిరీస్ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పటికే ఈ డివైజ్ 4G, 5G వేరియంట్‌లను కంపెనీ ప్రకటించింది.

Samsung Galaxy M13 Series : శాంసంగ్ గెలాక్సీ M13 5G సిరీస్ వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతంటే?

Samsung Galaxy M13 Series Launched In India, Price Starts From Rs 11,999 (1)

Samsung Galaxy M13 : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి M13 సిరీస్ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పటికే ఈ డివైజ్ 4G, 5G వేరియంట్‌లను కంపెనీ ప్రకటించింది. ఈ M13 సిరీస్ రెండు వెర్షన్‌లు వేర్వేరు స్పెసిఫికేషన్‌లతో వచ్చాయి. Samsung Galaxy M13 సిరీస్ ధర భారత మార్కెట్లో రూ. 11,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ తగినంత పెద్ద బ్యాటరీతో పాటు భారీ డిస్ప్లేలను అందిస్తాయి. అందులో ఒకటి Exynos SoCని కలిగి ఉంది. మరొకటి MediaTek చిప్‌ను అందిస్తుంది.

4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను కూడా ప్రకటించింది. ఈ మోడల్ ధర రూ. 13,999 వరకు ఉంటుంది. Samsung గెలాక్సీ M13 5G వెర్షన్ కూడా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. బేస్ మోడల్ 4GB RAM + 64GB స్టోరేజ్ ఫోన్ ధర రూ. 13,999 ఉంటే.. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 15,999గా నిర్ణయించింది. ఈ రెండు ఫోన్‌లు మిడ్‌నైట్ బ్లూ, ఆక్వా గ్రీన్, స్టార్‌డస్ట్ బ్రౌన్‌తో సహా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy M13 Series Launched In India, Price Starts From Rs 11,999

Samsung Galaxy M13 Series Launched In India, Price Starts From Rs 11,999

M13 4G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవే :
Samsung Galaxy M13 4G 6.6-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేతో వచ్చింది. కంపెనీ ఇంటర్నల్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 128GB వరకు స్టోరేజీ, 6GB RAM ద్వారా సపోర్టు అందిస్తుంది. శాంసంగ్ ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకునే అవకాశం ఉంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ది బాక్స్‌తో వస్తుంది. హుడ్ కింద 6,000mAh బ్యాటరీ కూడా ఉంది. కంపెనీ కేవలం 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను మాత్రమే అందించింది. ఫ్రంట్ సైడ్.. స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-MP ప్రైమరీ కెమెరా, 5-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2-MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలకు ముందు భాగంలో 8MP కెమెరా ఉంది.

Galaxy M13 5G స్పెసిఫికేషన్స్ ఇవే :
శాంసంగ్ Galaxy M13 5G, 6.5-అంగుళాల ఫుల్-HD+ IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. MediaTek Dimensity 700 5G SoCతో రన్ అవుతుంది. 128GB వరకు స్టోరేజీ, 6GB RAM ద్వారా సపోర్టు అందిస్తుంది. 4G మోడల్‌తో పోలిస్తే.. కొంచెం చిన్న బ్యాటరీని కలిగి ఉంది. 15W ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 50-MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5-MP సెల్ఫీ షూటర్ ఉంది.

Read Also : Samsung Galaxy S23 Series : స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 SoCతో గెలాక్సీ S23 సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే?