ఐసీఐసీఐ కస్టమర్లకు బిగ్ షాక్

దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఖాతాదారుల జేబులకు చిల్లు పెట్టే నిర్ణయాలు తీసుకుంది. చార్జీల మోత మోగించింది. సేవింగ్స్

  • Published By: veegamteam ,Published On : December 5, 2019 / 03:59 PM IST
ఐసీఐసీఐ కస్టమర్లకు బిగ్ షాక్

దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఖాతాదారుల జేబులకు చిల్లు పెట్టే నిర్ణయాలు తీసుకుంది. చార్జీల మోత మోగించింది. సేవింగ్స్

దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఖాతాదారుల జేబులకు చిల్లు పెట్టే నిర్ణయాలు తీసుకుంది. చార్జీల మోత మోగించింది. సేవింగ్స్ అకౌంట్స్‌లో డబ్బు డిపాజిట్ చేయాలన్నా.. అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలన్నా చార్జీలు చెల్లించాల్సిందే. పరిధికి మించి నగదు లావాదేవీలు దాటితే… వినియోగదారుల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు. డిసెంబర్ 15 నుంచి చార్జీల పెంపు నిర్ణయం అమల్లోకి వస్తుంది. 
 
బ్యాంక్‌కు వెళ్లి కేవలం నాలుగు సార్లు మాత్రమే క్యాష్ ట్రాన్సాక్షన్లు నిర్వహించుకోగలం. ఆ తర్వాత రూ. 150 ఛార్జీని వసూలు చేస్తారు. ఇక కస్టమర్లు… ఎటువంటి రుసుమూ లేకుండా హోమ్ బ్రాంచ్ నుండి రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంటుంది.
 
ఇక… నగదు లావాదేవీలకు రోజుకు రూ. 25 వేల వరకు ఛార్జీలు లేవు. రూ. 25 వేలకు పైబడిన లావాదేవీలకు సంబంధించి… రూ. వెయ్యికి రూ. 5, కనీసం రూ .150 కు లోబడి ఛార్జి ఉంటుంది. థర్డ్ పార్టీ లావాదేవీల విషయంలో వినియోగదారులు రోజుకు రూ. 25 వేల పరిమితితో ప్రతి లావాదేవీకి రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. రూ. 25 వేలకు మించిన లావాదేవీలను బ్యాంక్ అనుమతించదు.

* నెలలో కేవలం 4 ఉచిత లావాదేవీలు
* ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌పై(డిపాజిట్, విత్ డ్రా) రూ.150 పెనాల్టీ(
* హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి కేవలం రూ.2 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ 
* రూ.2 లక్షల వరకు మాత్రమే విత్‌డ్రా
* ఈ పరిమితి దాటితే ప్రతి రూ.1,000 రూ.5 చార్జీ చెల్లించాలి. గరిష్టంగా రూ.150 పెనాల్టీ