పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా? : మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ.. చెక్ చేసుకోండి!

  • Published By: sreehari ,Published On : February 10, 2020 / 01:15 AM IST
పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా? : మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ.. చెక్ చేసుకోండి!

పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా? మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జాగ్రత్త. వైఫై కనెక్షన్ ద్వారా ఈజీగా డేటా షేర్ చేసుకోవచ్చు. మొబైల్ డివైజ్ లేదా డెస్క్ టాప్ ఇలా ఏ డివైజ్ నుంచి అయినా ఈజీగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇదే యూజర్ల కొంప ముంచుతోంది. ఫ్రీగా వైఫై దొరికితే ఎవరైనా వదిలిపెడతారా? దొరికింది కదా ఛాన్స్ అంటూ మూవీలు, వీడియోలు తెగ డౌన్ లోడ్ చేసేస్తారు. పబ్లిక్ వైఫై నెట్ వర్క్ వాడే సమయంలో మీరు ఈ జాగ్రత్తలు  పాటిస్తున్నారా? లేదంటే.. మీకు తెలియకుండానే మీ వ్యక్తిగత వివరాలు మోసగాళ్ల చేతిల్లోకి వెళ్లిపోతాయి.

బ్యాంకు అకౌంట్ల వివరాలను దొంగిలించి డబ్బులు కాజేస్తారు. కానీ, ఇక్కడే మీరు ఆలోచించాల్సి విషయం ఒకటే.. పబ్లిక్ వైఫై నెట్ వర్క్ వాడొద్దు. సాధారణ బ్రౌజింగ్ కోసం వాడితే పర్వాలేదు.. కానీ, పబ్లిక్ వైఫై కనెక్ట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంకు అకౌంట్లలో లాగిన్ కావొద్దు. ఇలా చేయడం వల్ల మీ బ్యాంకు అకౌంట్ వివరాలు వైఫై ప్రొవైడ్ చేసేవారికి ఈజీగా తెలిసిపోతాయి. వెబ్ ఇంటర్ ఫేస్ నుంచి సులభంగా సెర్చ్ చేసినవారి వివరాలు వారికి చేరుతాయి. అనుమానాస్పద వెబ్ సైట్లను ఓపెన్ చేయకపోవడమే మంచిది. 

ఆయా వెబ్ సైట్లోకి వెళ్లి లింకులు క్లిక్ చేయడం ద్వారా మాల్ వేర్ మీ డివైజ్ ల్లోకి చేరి మీ పర్సనల్ డేటాను క్యాప్చర్ చేసే ముప్పు ఉంది. మీ డేటాకు మీరే బాధ్యులు. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు పబ్లిక్ వై-ఫై వినియోగంపై ఎప్పటికప్పుడూ అలర్ట్ చేస్తోంది. పబ్లిక్ వైఫై సర్వీసుతో బ్యాంకు అకౌంట్లను లాగిన్ కావొద్దని గట్టిగా హెచ్చరిస్తోంది.

అంతేకాదు.. బ్యాంకు అధికారులమంటూ ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ బ్యాంకు అకౌంట్ వివరాలు చెప్పమని లేదంటే మీ ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుందని భయపెడతారు. తొందరపడి చెప్పకండి. వారు చెప్పింది నమ్మి మీ వివరాలు ఇచ్చారంటే.. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది. ఏటీఎం కార్డు నెంబర్ లేదా 4 అంకెల పిన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, CVV నెంబర్ ఇలాంటివి ఏవీ చెప్పకూడదు. 

ఏ బ్యాంకు అధికారి కూడా కస్టమర్ కు ప్రత్యేకించి ఫోన్ చేసి మీ వ్యక్తిగత వివరాలను అడగరని గుర్తించుకోండి. కస్టమర్లు తమ బ్యాంకు అకౌంట్ వివరాల్లో పాస్ వర్డ్, ఏటీఎం కార్డు నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్ ఫోన్లో సేవ్ చేసుకోవద్దు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు మాత్రమే మీ డెబిట్ కార్డుతో మనీ విత్ డ్రా చేసుకోండి.

అపరిచితులకు మీ కార్డును ఇవ్వొద్దు. క్రెడిట్ కార్డు వివరాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి షేర్ చేయకండి. ఇలా చేస్తే మీకు తెలియకుండానే మీ అకౌంట్ల నుంచి మోసగాళ్లు డబ్బులు కాజేస్తారని మరవకండి. సో.. బీఅలర్ట్.. మీ డబ్బుకు మీరే బాధ్యులు.. డబ్బులు పోయాక ఎవరిని నిందించినా ఫలితం ఉండదు.