SBI ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కొత్త వడ్డీరేట్లు ఇవే

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI)ఫిక్సడ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించింది. ఇప్పటివరకూ ఫిక్సడ్ డిపాజిట్లపై ఉన్న వడ్డీరేట్లను ఏడాది నుంచి 2ఏళ్లకు పెంచింది.

  • Published By: sreehari ,Published On : May 10, 2019 / 10:18 AM IST
SBI ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కొత్త వడ్డీరేట్లు ఇవే

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI)ఫిక్సడ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించింది. ఇప్పటివరకూ ఫిక్సడ్ డిపాజిట్లపై ఉన్న వడ్డీరేట్లను ఏడాది నుంచి 2ఏళ్లకు పెంచింది.

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించింది. ఇప్పటివరకూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఉన్న వడ్డీరేట్లను ఏడాది నుంచి 2ఏళ్లకు పెంచింది. ఇతర లాంగ్ టెర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను మాత్రం ఎస్ బీఐ తగ్గించింది. మే 9, 2019 నుంచి ఎస్ బీఐ కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వచ్చేశాయి. ఈ కొత్త వడ్డీరేట్లు.. కొత్త డిపాజిట్లు, మెచ్యురింగ్ డిపాజిట్ల రెన్యువల్ కు వర్తిస్తాయి.

SBI తమ వడ్డీరేట్లను.. ఎస్ బీఐ ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్ 2006 (SBITSS) రిటైల్ డిపాజిట్లు, NRO డిపాజిట్లు, ప్రతిపాదిత దేశీయ రిటైల్ టెర్మ్ డిపాజ్లతో కలిపి ఈ కొత్త వడ్డీరేట్లు వర్తించనున్నాయి. టీడీఎస్ డిపాజిట్లపై ఇప్పటికే వడ్డీరేట్లు పెరగగా.. పోస్టు ఆఫీసు డిపాజిట్లు కూడా పెరిగాయి.

దీని పరిమితి రూ.10వేల నుంచి రూ.40వేల వరకు పెరిగింది. అంటే.. సుమారు రూ.6 లక్షల డిపాజిట్ పై.. వడ్డీరేటు ఏడాదిలో 7శాతంగా నమోదు అవుతుంది. అయితే వార్షిక వడ్డీరేటు మాత్రం టీడీఎస్ కు లోబడి ఉండదు. 

రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై SBI FD రేట్లు :
* 7 రోజుల నుంచి ఏడాది డిపాజిట్లపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు ఉండదు.
* 1 ఏడాది నుంచి 2ఏళ్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీరేటు 6.8 శాతం నుంచి 7 శాతం పెంపు
* 2ఏళ్ల నుంచి 3ఏళ్ల లోపు డిపాజిట్లపై స్వల్పంగా 6.8 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గింపు
* 3ఏళ్ల నుంచి 5ఏళ్ల లోపు ఎఫ్ డీ డిపాజిట్లపై స్వల్పంగా 6.8 శాతం నుంచి 6.70శాతానికి తగ్గింపు
* 5ఏళ్ల నుంచి 10ఏళ్ల ఎఫ్ డీ డిపాజిట్లపై 6.85 శాతం నుంచి 6.60 శాతానికి తగ్గింపు
* సీనియర్ సిటిజన్లు తమ FD డిపాజిట్లపై అదనంగా 0.5 శాతం వడ్డీరేటును పొందవచ్చు

కొత్త సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీరేట్ల రూల్స్ :
ఇటీవల SBI.. సేవింగ్స్ అకౌంట్ల బ్యాలెన్స్ పై వడ్డీరేట్ల రూల్స్ మార్చేసింది. సేవింగ్స్ ఖాతాల్లో ఇకపై ఫిక్స్‌డ్‌ పర్సంటేజ్ వడ్డీ రేట్లు ఉండవు. ఆర్బీఐ విధించే రేపో రేటు ఆధారంగా మార్పులు జరుగుతుంటాయి. సేవింగ్స్ అకౌంట్లలో రూ.1 లక్షకు పైగా బ్యాలెన్స్ ఉండే వాటికే వడ్డీరేట్లు వర్తిస్తాయి.

అంతకంటే తక్కువ ఉన్న అకౌంట్లపై ఏడాదికి 3.5శాతం వడ్డీరేట్లు ఉండనున్నాయి. చిన్నమొత్తంలో డిపాజిట్లపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ రూల్స్ మే 1, 2019 నుంచి అమల్లోకి వచ్చాయి.