మినిమం బ్యాలెన్స్ ఎత్తేసిన SBI, వడ్డీ రేట్లు కూడా తగ్గాయి

  • Published By: sreehari ,Published On : March 11, 2020 / 12:35 PM IST
మినిమం బ్యాలెన్స్ ఎత్తేసిన SBI, వడ్డీ రేట్లు కూడా తగ్గాయి

SBI యూజర్లకు గుడ్ న్యూస్. మీ అకౌంట్లపై మినిమం బ్యాలెన్స్ (కనీస నగదు నిల్వ) నిబంధన ఎత్తివేసింది.  MCLR రేట్లను, డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేట్లను కూడా తగ్గించింది. ఈ మేరకు బుధవారం బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎస్‌బీఐ కస్టమర్లు తమ సేవింగ్ అకౌంట్లలో నెలవారీగా కనీస నిల్వను పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది.

అంతేకాదు.. సేవింగ్ అకౌంట్లపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది. ప్రస్తుతం.. రూ.లక్ష వరకు డిపాజిట్ చేసే సేవింగ్ అకౌంట్లపై వడ్డీ రేట్లను 3.25 శాతంగా ఉండగా, రూ.లక్షకు పైగా డిపాజిట్ అకౌంట్లపై 3శాతంగా ఉంది. దేశంలో ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ ప్రోత్సాహంలో భాగంగా మొత్తం 44.51 కోట్ల SBI అకౌంట్లలో Average monthly balance చార్జీలను రద్దు చేస్టున్నట్టు వెల్లడించింది.

అలాగే SMS ఛార్జీలను కూడా మాఫీ చేసింది. ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాంక్ వినియోగదారుల మెట్రో, సెమీ అర్బన్,  గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా రూ. 3,000, రూ.2,000, రూ.1,000  వరకు నెలవారీగా మినమం బ్యాలెన్స్ తప్పక ఉండాలి. లేదంటే ట్యాక్సులతో పాటు రూ.5 నుంచి రూ.15 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.