ఫెస్టివల్ ఆఫర్ : క్రెడిట్ కార్డు అక్కర్లేదు.. Debit కార్డులపై EMI ఆఫర్ 

అసలే పండగ సీజన్. ఎక్కడ చూసిన పండగ ఆఫర్లే. స్మార్ట్ ఫోన్ల నుంచి టీవీలు, అన్ని ఆన్ లైన్ వస్తువులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

  • Published By: sreehari ,Published On : October 7, 2019 / 10:56 AM IST
ఫెస్టివల్ ఆఫర్ : క్రెడిట్ కార్డు అక్కర్లేదు.. Debit కార్డులపై EMI ఆఫర్ 

అసలే పండగ సీజన్. ఎక్కడ చూసిన పండగ ఆఫర్లే. స్మార్ట్ ఫోన్ల నుంచి టీవీలు, అన్ని ఆన్ లైన్ వస్తువులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

అసలే పండగ సీజన్. ఎక్కడ చూసిన పండగ ఆఫర్లే. స్మార్ట్ ఫోన్ల నుంచి టీవీలు, అన్ని ఆన్ లైన్ వస్తువులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కామర్స్ వెబ్ సైట్లలో కూడా తక్కువ ధరకే ప్రొడక్టులను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకులు కూడా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆఫర్లు గుప్పిస్తున్నాయి.

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్ల కోసం బిగ్ ఆఫర్ ప్రకటించింది. మహానవమిని పురస్కరించుకుని రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేసే వస్తువులపై తమ కస్టమర్లకు డెబిట్ కార్డులపై EMI ఆఫర్ తీసుకొచ్చింది. 

SBi డెబిట్ కార్డులతో షాపింగ్ చేసినవారికి ఈఎంఐ ఆప్షన్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఎస్బీఐకి 30 కోట్ల మంది డెబిట్ కార్డు యూజర్లు ఉన్నారు. వారిలో 45 లక్షల మంది యూజర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అక్టోబర్ 1 నుంచి ఎస్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 32 కోట్ల మంది ఎస్బీఐ అకౌంట్ యూజర్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

అప్పటి నుంచి కనీస నగదు జమ (MAB) చేయని కస్టమర్లకు ఎస్బీఐ సర్వీసు ఛార్జీలు విధించనుంది. ఎస్బీఐ మరిన్ని మార్పులు చేసింది. NEFT, RTGS ఆన్ లైన్ లావాదేవీలపై చార్జీలు ఎత్తివేసింది. మెట్రో సిటీ, అర్బన్ ఏరియా బ్రాంచ్ ల్లో అకౌంట్ దారులకు అంతకుముందు నెలవారీ నగదు జమ రూ.5వేలు వరకు ఉండగా… ఇప్పుడు రూ.3వేల పరిమితి విధించింది. 

Debit Card EMI ఆఫర్ యాక్టివేషన్ ఇలా : 
* మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే దానిపై EMI ఆఫర్ యాక్టివేట్ చేసుకోవాలి.
* PoS మిషన్ ద్వారా డెబిట్ కార్డును స్వైప్ చేసుకుని కూడా EMI ఆఫర్ కన్వర్ట్ చేసుకోవచ్చు. 
* నెలల వారీగా ఇన్ స్టాల్ మెంట్ చేసుకోవచ్చు.
* 6 నెలల నుంచి 18 నెలల వరకు కాల పరిమితి సెట్ చేయొచ్చు.
* ట్రాన్సాజెక్షన్ పూర్తి చేసిన నెల తర్వాత ఇన్ స్టాల్ మెంట్ ప్రారంభం అవుతుంది.
* కస్టమర్లు.. ఫైనాన్షియల్, క్రెడిట్ హిస్టరీ ఆధారంగా EMI ఆఫర్ వర్తిస్తుంది.
* అప్పుడు మాత్రమే డెబిట్ కార్డుల నుంచి లోన్లు పొందేందుకు అర్హులు
* 40వేల మర్చంట్లు, రిటైల్ స్టోర్ల నుంచి కస్టమర్లు ప్రొడక్టులు కొనవచ్చు.
* 15వందల నగరాల్లో మొత్తం 4.5 లక్షల PoS (పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు ఉన్నాయి.
* జీరో డాక్యుమెంటేషన్ తో EMI బెనిఫెట్స్ పొందవచ్చు.
* ఎలాంటి ప్రాసిసెంగ్ ఫీజు ఉండదు. బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 
* ఇన్ స్టంట్ మనీ ట్రాన్స్ ఫర్ అవుతుంది. జోరో కాస్ట్ EMI (ఎంపిక చేసిన బ్రాండ్లపై)