మనీ కావాలంటే OTP మస్ట్ : జనవరి 1 నుంచి అమలు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఏడాది 2020 నుంచి కొత్త విధానం తీసుకురానుంది. అదే OTP. ఇకపై SBI ఏటీఎంలలో డబ్బు డ్రా

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 07:15 AM IST
మనీ కావాలంటే OTP మస్ట్ : జనవరి 1 నుంచి అమలు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఏడాది 2020 నుంచి కొత్త విధానం తీసుకురానుంది. అదే OTP. ఇకపై SBI ఏటీఎంలలో డబ్బు డ్రా

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఏడాది 2020 నుంచి కొత్త విధానం తీసుకురానుంది. అదే OTP. ఇకపై SBI ఏటీఎంలలో డబ్బు డ్రా చేయాలంటే వన్ టైమ్ పాస్‌ వర్డ్-OTP మస్ట్. 2020 జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. దేశంలోని అన్ని ఎస్బీఐ ఏటీఎంలలో ఇది వర్తిస్తుంది. 2020 జనవరి 1 నుంచి ఎస్బీఐ ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ నియమం వర్తిస్తుంది. ఏటీఎంలలో అనధికార లావాదేవీలు పెరిగిపోతుండటంతో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఎస్బీఐ. అయితే రూ.10వేలు కన్నా ఎక్కువ డ్రా చేసే సమయంలో మాత్రమే ఓటీపీ తప్పనిసరి చేసింది ఎస్‌బీఐ. ఇప్పటికే కెనరా బ్యాంకు ఏటీఎంలల్లో ఇదే విధానం ఉంది.

* ఎస్బీఐ ఏటీఎంకు రాత్రి 8 గంటల తర్వాత వెళితే.. కార్డు ఇన్సర్ట్ చేసి పిన్ ఎంటర్ చేస్తే సరిపోదు. 
* రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. 
* ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే డబ్బులు వస్తాయి. 
* అంటే కార్డు ఇన్సర్ట్ చేసి ఓటీపీ తప్పనిసరిగా టైప్ చేయాలి. 
* అప్పుడే డబ్బులు డ్రా అవుతాయి. 
* దీని వల్ల కస్టమర్ల ఖాతాలకు మరింత సెక్యూరిటీ. 
* కార్డు పోగొట్టుకున్నా, వారికి పిన్ తెలిసినా డబ్బు డ్రా చేయలేరు. 
* అయితే ఈ విధానం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది.