SBI ఖాతాదారులకు షాక్ : కొత్త సర్వీసు ఛార్జీలు!

  • Published By: madhu ,Published On : September 8, 2019 / 08:14 AM IST
SBI ఖాతాదారులకు షాక్ : కొత్త సర్వీసు ఛార్జీలు!

మీరు స్టేట్ బ్యాంకు ఖాతాదారులా.. మీకో షాకింగ్ న్యూస్. ఎస్బీఐ అకౌంట్ లావాదేవీల నిబంధనల్లో మార్పులు తీసుకొస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త సర్వీసు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. మనీ డిపాజిట్, విత్ డ్రా, చెక్ బుక్ వినియోగంపై సర్వీసు ఛార్జీలు విధించనుంది. 

* కొత్త రూల్స్ ప్రకారం SBI కస్టమర్లు.. నెలకు 3 సార్లు మాత్రమే ఫ్రీగా మనీ డిపాజిట్ చేసుకోవచ్చు. 
* ఆ తర్వాత డిపాజిట్ చేస్తే..రూ. 50 ఛార్జీ  చెల్లించాల్సి వస్తుంది. దీనికి GST అదనం. 
* ఒక నెలలో 5వ సారి డిపాజిట్ చేస్తే..రూ. 56 ఛార్జీ వసూలు చేస్తారు. 
* చెక్ బౌన్స్ అయితే..రూ. 150. దీనికి GST అదనం.
* నాన్ మెట్రో నగరాల్లో SBI ఏటీఎంలలో ఎలాంటి ఛార్జీలు లేకుండా..12 సార్లు డ్రా చేసుకోవచ్చు. 
* ఇతర ఏటీఎంలలో కేవలం 5 సార్లు మాత్రమే ఉచితంగా డ్రా చేసుకొనే అవకాశం ఉంది. 
* అక్టోబర్ 1 నుంచి బ్యాంకుకు వెళ్లి RTGS లేదా..NEFT ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తే ఛార్జీలు తప్పవు.
* RTGSలో రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ట్రాన్సాక్షన్ జరిపితే..రూ. 20 (GST) అదనం. 
* రూ. 5 లక్షలకు పైన మొత్తంపై రూ. 40 (GST) అదనం వసూలు చేస్తారు. 
* రూ. 10 వేల లోపు NEFT ట్రాన్సాక్షన్స్‌కు రూ. 2 వసూలు చేస్తారు. 
* రూ. 1 లక్షలోపు రూ. 4, రూ. 2 లక్షలోపు రూ. 12 వసూలు చేస్తారు.