SBI సేవింగ్ అకౌంట్ వడ్డీ కోత

  • Published By: madhu ,Published On : May 1, 2019 / 02:46 AM IST
SBI సేవింగ్ అకౌంట్ వడ్డీ కోత

SBI సేవింగ్ అకౌంట్ ఉందా ? అయితే మీ కోసమే..మీ అకౌంట్‌లో ఎంత మొత్తం ఉన్నా.. 3.5 శాతం వడ్డీ వచ్చేది కదా..ఇప్పుడు ఈ వడ్డీ అంతగా రాదు. SBI వడ్డీ కోత విధించింది. రూ. లక్ష దాటి ఉంటే వడ్డీ రేటును పావు శాతం తగ్గించింది. దీనితో కస్టమర్లకు 3.25 శాతం వడ్డీయే అందుతుంది. మే 01వ తేదీ బుధవారం నుండే అమల్లోకి రానుంది. ఖాతాల్లో లక్ష లోపు ఉంటే మాత్రం వడ్డీరేటు 3.5 శాతంగానే ఉంటుంది.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రుణాలపై రెపోరేటుకు అనుసంధానం చేస్తూ..ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. వడ్డీ త్రై మాసికం ప్రాతిపదికన చెల్లించడం జరుగుతుంది. 2018 డిసెంబర్ నాటికి SBI దేశీయ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ల విలువ దాదాపు రూ. 10.64 లక్షల కోట్లు. దేశ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగ‌దారుల‌కు ప‌ర్సనల్ బ్యాకింగ్ పోర్టుపోలియోలో భాగంగా వివిధ సేవలందిస్తోంది. సేవింగ్స బ్యాంక్ ఖాతాలో పొదుపు చేస్తే నగదు సురక్షితంగా ఉండడంతో పాటు ఆశించిన వడ్డీ రేట్లను పొందవచ్చు.