Insurance Services : ఆరోగ్య బీమా సేవలకోసం గుగూల్ పేతో ఎస్ బీ ఐ ఒప్పదం..

ఆరోగ్య బీమాకు సంబంధించి టెక్నికల్ సర్వీస్‌ను మాత్రమే గూగుల్ పే అందిస్తుంది. కస్టమర్లు ఇకపై గూగుల్‌పే స్పాట్‌లో క్షణాల్లో ఆరోగ్య బీమా కొనుగోలు చేయొచ్చు.

Insurance Services : ఆరోగ్య బీమా సేవలకోసం గుగూల్ పేతో ఎస్ బీ ఐ ఒప్పదం..

Sbi Google

Insurance Services : దీపావళికి ఎస్ బీ ఐ జనరల్ ఇన్సూరెన్స్ వినియోగదారులకు శుభావార్త నందించింది. ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన ఎస్‌బీఐ, వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు తన సేవలను విస్తరిస్తోంది. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ఆరోగ్య బీమా పాలసీలను కస్టమర్లకు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో గూగుల్‌పేతో చేతులు కలిపింది. గూగుల్‌పే యాప్ ద్వారా ఆరోగ్యభీమా సేవలు పొందేందుకు వీలుగా ఆసంస్ధతో అవగాహన ఒప్పందం చేసుకుంది. దీనిద్వారా ఇకపై ఇంటి నుంచే ఎస్ బీ ఐ కు చెందిన ఎటువంటి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడనుంది.

ఆ రోగ్య బీమా కోసం పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు.. ఎక్కువ సంఖ్యలో ప్రజలను ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌, గూగుల్‌ పే తో ఒప్పందం చేసుకోవటం మంచి ముందడుగని ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌ తెలిపింది. అయితే ఆరోగ్య బీమాకు సంబంధించి టెక్నికల్ సర్వీస్‌ను మాత్రమే గూగుల్ పే అందిస్తుంది. కస్టమర్లు ఇకపై గూగుల్‌పే స్పాట్‌లో క్షణాల్లో ఆరోగ్య బీమా కొనుగోలు చేయొచ్చు. ఆరోగ్య బీమా పాలసీని అందించేది మాత్రం ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌ సంస్థ అందిస్తుంది. దీనికి తోడుగా గూగుల్‌పే స్పాట్ ద్వారా ఆరోగ్య సంజీవిని పేరుతో.. ఒక ప్రామాణిక ఆరోగ్య బీమా ప్లాన్ అందిస్తున్నట్లు తెలిపింది. దేశంలోని బీమా సంస్థతో గూగుల్ పే జట్టుకట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.

గూగుల్ పే స్పాట్‌లో ఎస్‌బీఐ జనరల్ ఇన్సురెన్స్‌ అందించే ఆరోగ్య సంజీవిని పాలసీ అందుబాటులో ఉంది. ఆరోగ్య సంజీవని అనేది ఒక ప్రామాణిక ఆరోగ్య బీమా పాలసీ. అతి తక్కువ ప్రీమియంతో ప్రామాణిక కవరేజీని అందించేందుకు ఎస్‌బీఐ జనరల్ హెల్త్ ఇన్సురెన్స్ ఈ పాలసీని ప్రారంభించింది. వినియోగదారులు ఆరోగ్య సంజీవని పాలసీ కింద వ్యక్తిగత, కుటుంబ ప్లాన్‌లను గూగుల్‌పే స్పాట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు.