SBI Users FASTag : ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. FASTag బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు..!

SBI Users FASTag : దేశీయ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారుల కోసం ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ (FASTag Balance)ను సులభంగా చెక్ చేసుకునేందుకు కొత్త SMS సర్వీసును ప్రారంభించింది.

SBI Users FASTag : ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. FASTag బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు..!

SBI users can now check FASTag balance by sending a message, here is how

SBI Users FASTag : దేశీయ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారుల కోసం ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ (FASTag Balance)ను సులభంగా చెక్ చేసుకునేందుకు కొత్త SMS సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసు ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్లో (FASTag Account)లో మిగిలిన బ్యాలెన్స్‌ను ట్రాక్ చేసేందుకు ఎస్బీఐ కస్టమర్లకు అనుమతిస్తుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) FASTag అని పిలిచే ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థను నిర్వహిస్తోంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఫాస్ట్‌ట్యాగ్‌తో లింక్ చేసిన సేవింగ్స్ అకౌంట్ నుంచి నేరుగా టోల్ టాక్స్ చెల్లించవచ్చు. తద్వారా ఈ సిస్టమ్ ప్రయాణికులను అనుమతిస్తుంది.

ఫాస్ట్‌ట్యాగ్ ఏర్పాటు చేయడం ద్వారా డ్రైవింగ్‌లో లేదా ట్రిప్‌కు వెళ్లేటప్పుడు క్యాష్ అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మీ ఫాస్ట్‌ట్యాగ్‌ని రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. మీ వాహనం విండ్‌ స్క్రీన్‌కి అంటించిన ఫాస్ట్‌ట్యాగ్ (RFID ట్యాగ్) నుంచి టోల్ వసూలు అవుతుంది. ఈ ప్రక్రియ రాష్ట్ర సరిహద్దుల్లో టోల్‌లు చెల్లించేందుకు వినియోగదారులకు సులభతరం చేస్తుంది. ఒక క్లిక్‌తో ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకునేందుకు మరో మార్గం లేదు. ఇప్పుడు.. SBI అకౌంట్ కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా జనరల్ SMS ప్రక్రియతో ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ను చెక్ చేయవచ్చు.

SBI users can now check FASTag balance by sending a message, here is how

SBI users can now check FASTag balance by sending a message, here is how

SMS ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలంటే? :
* ఒకే వాహనం కోసం FTBAL లేదా FTBAL అని టైప్ చేయండి. మీ మెసేజ్ బాక్స్‌లో నిర్దిష్ట వాహనం కోసం (మీకు మల్టీ SBI ఫాస్ట్‌ట్యాగ్‌లు ఉంటే).
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7208820019కి SMS ద్వారా పై మెసేజ్ పంపండి.
* బ్యాంక్ మీ SBI ఫాస్ట్‌ట్యాగ్‌లో మిగిలిన బ్యాలెన్స్‌ను వెంటనే మీకు మెసేజ్ ద్వారా పంపుతుంది.

రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటర్ వెహికల్స్ రూల్స్ (CMVR) 1989 ప్రకారం.. జనవరి 1, 2021 నుంచి అమలులోకి వచ్చే ఫాస్ట్‌ట్యాగ్‌ తప్పనిసరి చేసింది. ఫోర్ వీల్స్ వాహనాలు లేదా అంతకంటే ఎక్కువ రవాణా చేసే అన్ని క్లాసుల M, N వాహనాలకు మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ CMVR 1989 ప్రకారం.. మీరు 1 ఏప్రిల్ 2021 నాటికి కొత్త థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేస్తే మాత్రం ఫాస్ట్‌ట్యాగ్ కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ ఏ బ్యాంక్ ద్వారా అయినా చేయవచ్చు. అయితే, ఫాస్ట్‌ట్యాగ్ కోసం అప్లయ్ చేసుకోవాలనుకునే SBI కస్టమర్‌లు 5 ఏళ్ల చెల్లుబాటు వ్యవధితో పొందడానికి PoS ఫెసిలిటీని పొందాలి. ఫాస్ట్‌ట్యాగ్‌ని టోల్ పేమెంట్స్ చెల్లించడానికి SBI లేదా రిజిస్టర్డ్ బ్యాంక్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also : iPhone 14 Battery Capacity : ఐఫోన్ 14 బ్యాటరీ కెపాసిటీ తెలిసిందోచ్.. ఐఫోన్ 13 సిరీస్ కన్నా బ్యాటరీ పెద్దదేనా? ఏది బెటర్ అంటే?