రాయదుర్గం, లక్డీకపూల్ నుంచి ఎయిర్ పోర్టుకే మెట్రో సర్వీసులు

  • Published By: chvmurthy ,Published On : February 25, 2020 / 03:41 PM IST
రాయదుర్గం, లక్డీకపూల్ నుంచి ఎయిర్ పోర్టుకే మెట్రో సర్వీసులు

హైదరాబాద్ లో రెండో దశ మెట్రో రైలు నిర్మాణానికి ప్రణాళికలు సిధ్ధం చేస్తున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ లు సిధ్ధం అయ్యాయని అన్నారు. రెండో దశలో  రాయదుర్గం నుంచి  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) వరకు (31కి.మీ) లక్డీకపూల్ నుంచి ఆర్జీఐఏ, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు  కొత్త మార్గాలలో మెట్రో రైలు నడిపే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పాత బస్తీలో  5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి  ప్రణాళికలు రెడీ ఉన్నాయని ఆయన వివరించారు.  హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రారంభం అయినప్పటినుంచి 16 కోట్ల మందికి పైగా ప్రయాణించారన్నారు.