కరోనా ఫియర్….రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్ క్రాష్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ(మార్చి-9,2020)కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లలో కరోనా ప్రభావం ఉన్న సమయంలో కనీసం 10 సంవత్సరాలలో అతిపెద్ద సింగిల్-డే పతనంలో బెంచ్ మార్క్ సూచికలు

కరోనా ఫియర్….రికార్డు స్థాయిలో  స్టాక్ మార్కెట్ క్రాష్

Stock Market

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ(మార్చి-9,2020)కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లలో కరోనా ప్రభావం ఉన్న సమయంలో కనీసం 10 సంవత్సరాలలో అతిపెద్ద సింగిల్-డే పతనంలో బెంచ్ మార్క్ సూచికలు 6 శాతానికి పైగా క్షీణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలిపోయాయి. మార్చి-9,2020 బ్లాక్ మండేగా నిలిచిపోయింది.(కరోనా భయం వద్దు…ఆరోగ్యంగా ఉన్నోళ్లు మాస్క్ ధరించనక్కర్లేదన్న కేజ్రీవాల్)

కరోనా మహమ్మారి తీవ్రత గురించి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు భయాందోళనకు గురయ్యారని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఆర్థిక మాంద్యం కొట్టుమిట్టాడుతున్న దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఇది మరో ఎదురు దెబ్బ అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

ఆయిల్ వార్, కరోనా ఫియర్ స్టాక్ మార్కెట్లను కుదిపేయడంతో భారీ నష్టాలతో ఇవాళ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్(BSE) సెన్సెక్స్ 1,942 పాయింట్లు నష్టపోయి 35,635 పాయింట్ల దగ్గర ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్(NSE)నిఫ్టీ 538 పాయింట్లు నష్టపోయి 10,451 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇంత తక్కువ స్థాయిలో దేశీయ మార్కెట్ పడిపోవడం 2010 తర్వాత ఇదే మొదటిసారి.

కరోనా ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. కరోనా మహమ్మారి భయానికి పెట్టుబడిదారులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వారు ముందడుగు వేయలేకపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 28శాతాం పడిపోయింది. అంతర్జాతీయంగా భారీగా ముడి చమురు ధరలు తగ్గాయి. సౌదీ అరేబియా,రష్యా మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనే దీనికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. ముడి చమురు ధరల తగ్గుదలతో భారత్ కు బాగా కలిసొచ్చే ఛాన్స్ ఉంది.