పరుగో పరుగు : సెన్సెక్స్, నిఫ్టీ రికార్డులు

  • Published By: madhu ,Published On : April 1, 2019 / 11:28 AM IST
పరుగో పరుగు : సెన్సెక్స్, నిఫ్టీ రికార్డులు

స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. రికార్డుల మోత మోగించింది. మార్చి 01వ తేదీ సోమవారం సెన్సెక్స్ 39 వేల 017 పాయింట్లు, నిఫ్టీ 11,710 పాయింట్ల మార్కును తాకాయి. చివరిలో తీవ్రమైన అమ్మకాలు ఎదురైనా సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఐటీ, ఆటో రంగాలు, మెటల్, బ్యాంకింగ్ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రారంభం కాగానే పటిష్ట లాభాలతో ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం వరకు అదే ట్రేడింగ్ నడిచింది.

ఉదయం 10.25 గంటలకు BSE సెన్సెక్స్ 349 పాయింట్ల వద్ద 39,021కు చేరింది. నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 11, 712 వద్దకు చేరుకుంది. తొలిసారి 39వేల మార్క్‌ని సెన్సెక్స్ క్రాస్ చేసింది. నిఫ్టీ 11, 650 వద్ద ముగిసింది. ఆఖరిలో అమ్మకాల నుండి ఒత్తిడి ఎదురైంది. టాటా మోటార్స్, వేదాంత, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీ లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ షేర్లు దాదాపు 5 శాతం లాభపడ్డాయి. మార్చి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు ఉండవచ్చునని ప్రచారం జరగడంతో షేర్లు దూకుడుగా ట్రేడయ్యాయి.