Sensex: భారత మార్కెట్లకు జోష్.. 1,000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

భారత స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో నడిచాయి. వడ్డీ రేటు 0.75 బేసిస్ పాయింట్లు పెంచుతూ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం భారత మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా పెరిగింది.

Sensex: భారత మార్కెట్లకు జోష్.. 1,000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

Sensex

Sensex: భారత స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలబాట పట్టాయి. సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. గరిష్టంగా 56,822 పాయింట్ల వరకు చేరింది. మరోవైపు నిఫ్టీ కూడా జోరు చూపించింది. నిఫ్టీ దాదాపు 294 పాయింట్లు లాభపడి 16,916కు చేరుకుంది.

Young Voters: పదిహేడేళ్లకే ఓటరుగా పేరు నమోదు.. ఈసీ నిర్ణయం

ఈరోజు ఉదయం నుంచే మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. భారత స్టాక్ మార్కెట్‌తోపాటు ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే కొనసాగాయి. అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో బుధవారం అమెరికన్ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తే, దీని ప్రభావంతో గురువారం భారత మార్కెట్లు కూడా లాభాల్లోనే కొనసాగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 పాయింట్లు, స్మాల్ క్యాప్ 0.75 శాతం పెరిగాయి. ఎన్ఎస్ఈలోని 15 రంగాల సూచీల్లో దాదాపు 13 రంగాలు లాభాల్లోనే నడిచాయి.

Snake In Train: రైలు కంపార్టుమెంట్‌లో పాము.. హడలెత్తిన ప్రయాణికులు

మరోవైపు మార్కెట్లలో సానుకూల వాతావరణం ఉండటంతో డాలరుతో రూపాయి మారక విలువ కూడా స్వల్పంగా బలపడింది. డాలరుతో రూపాయి విలువ గురువారం 14 పైసలు పెరిగి 79.77 వద్ద కొనసాగింది. డాలరు విలువ బలహీనపడటం భారత్ వంటి మార్కెట్లకు కలిసొస్తుంది.