India Stock Market : బుల్ రంకేసింది…స్టాక్ మార్కెట్ లో రికార్డులు బ్రేక్

బుల్ రంకేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ లు ఫుల్ జోష్ లో కొనసాగాయి. భారీ లాభాలతో ట్రేడ్ అయ్యాయి. మార్కెట్ సూచీలు మరోసారి రికార్డులు బ్రేక్ అయ్యాయి.

India Stock Market : బుల్ రంకేసింది…స్టాక్ మార్కెట్ లో రికార్డులు బ్రేక్

Stock

Sensex-Nifty : బుల్ రంకేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ లు ఫుల్ జోష్ లో కొనసాగాయి. భారీ లాభాలతో ట్రేడ్ అయ్యాయి. మార్కెట్ సూచీలు మరోసారి రికార్డులు బ్రేక్ అయ్యాయి. అంతర్జాతీయంగా జరిగిన పరిణామాలు…సూచీలు రాకెట్ లా దూసుకెళ్లాయి. హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు ఇతర షేర్లు రాణించాయి. 2021, సెప్టెంబర్ 23వ తేదీ గురువారం స్టాక్ మార్కెట్ లో ప్రారంభమైనప్పటి నుంచి లాభాల బాటలో పయనించాయి.

Read More : TS RTC : బస్సు భవన్ కు వాస్తు తిప్పలు.. ప్రధాన ద్వారం మూసేసిన అధికారులు

సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు లాభాల్లో కొనసాగి…60 వేల మార్కుకు కొద్దిదూరంలో నిలిచింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే…17 వేల 800 పైన ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 73.64గా ఉంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు మార్చకపోవచ్చు, చైనా స్థిరాస్తి దిగ్గజం స్పందించడం తదితర కారణాల వల్ల స్టాక్ మార్కెట్ దూకుడుకు కారణమయ్యాయి.

Read More : Stock Market : సెన్సెక్స్ కొత్త రికార్డు.. రూ.3 లక్షల కోట్లు పెరిగిన BSE కంపెనీల విలువ

గురువారం సెన్సెక్స్ 59 వేల 275 పాయింట్ల వద్ద ప్రారంభమైంద. లాభాలతో ట్రేడవుతూ…అదే కంటిన్యూగా కొనసాగింది. మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 958.03 పాయింట్ల లాభంతో 59 వేల 885.36 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే బాట పట్టింది. 276.30 పాయింట్లు లాభపడి…17 వేల 823 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో టాటా మోటార్స్, ఎల్ అండ్ టి, కోల్ ఇండియా, బజాజ్ పిన్ సర్వే, హిందాల్కో లాభపడగా…డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, టాటా కన్జ్యూమర్, నెస్లే ఇండియా, హెచ్ డీఎఫ్ సీ లైఫ్ షేర్లు నష్టాలు చవి చూశాయి. మొత్తానికి స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టడంతో ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేశారు.