భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు…దూసుకెళ్లిన జెట్ షేర్లు

  • Published By: venkaiahnaidu ,Published On : March 26, 2019 / 11:21 AM IST
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు…దూసుకెళ్లిన జెట్ షేర్లు

 దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నాటి  నష్టాల నుంచి బయటపడి మంగళవారం(మార్చి-26,2019) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 425 పాయింట్లు లాభపడి 38,233 దగ్గర, నిఫ్టీ 129 పాయింట్లు లాభంతో 11,483 దగ్గర స్థిరపడ్డాయి. ముఖ్యంగా స్థిరాస్తి,ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకెళ్లాయి.జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు ఇవాళ ట్రేడింగ్‌ లో దాదాపు 9శాతం పెరిగాయి. జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ నరేష్‌ గోయల్‌, ఆయన భార్య సంస్థ నుంచి తప్పుకోవడం,ప్రభుత్వ రంగ బ్యాంకులు పెట్టుబడులు పెట్టనుండటంతో షేర్లు పెరిగాయి. డీఎల్‌ ఫ్‌ షేరు కూడా దాదాపు 7శాతం పెరిగింది. దాదాపు రూ.3,175 కోట్లు సేకరించేందుకు క్యూఐపీకి వెళ్లనున్నట్లు జెట్‌ ప్రకటించడంతో షేర్లు ర్యాలీ చేశాయి.నిఫ్టీ ఐటీ రంగ సూచీ మాత్రం నష్టాల్లో ట్రేడైంది. ముఖ్యంగా టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టపోయాయి.