Reliance Retail వెంచర్స్ లో Silver Lake పెట్టుబడులు

  • Published By: madhu ,Published On : September 9, 2020 / 11:27 AM IST
Reliance Retail వెంచర్స్ లో Silver Lake పెట్టుబడులు

వ్యాపార రంగంలో రిలయెన్స్ సంస్థ దూసుకపోతోంది. ఈ కంపెనీకి చెందిన వివిధ విభాగాల్లో పేరొందిన కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ రిలయెన్స్ రిటైల్ వెంచర్స్ లో రూ. 7 వేల 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయెన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.




ఈ పెట్టుబడితో RRVL లో సిల్వర్ లేక్ 1.75 శాతం వాటా సొంతం కానుంది. ఇలా పెట్టుబడులు పెట్టడం ఇది రెండోసారి. రిలయన్స్‌ జియోలో ఇప్పటికే సిల్వర్‌ లేక్‌ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.




రిలయెన్స్ రిటైల్ దేశ వ్యాప్తంగా విస్తరించి ఉంది. సుమారు 12 వేల స్టోర్స్ ఉన్నట్లు, రెండు కోట్ల మంది వ్యాపారులు రిటైల్ తో అనుసంధానమై ఉన్నట్లు అంచనా. తాజాగా జరిగిన ఈ డీల్ తో రిలయెన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరుకుందని అంచనా వేస్తున్నారు.
https://10tv.in/beware-fake-jiomart-websites-dupe-consumers-reliance-warns/



డిజిటల్ అనుబంధ విభాగం రిలయెన్స్ బాటలో రిలయెన్స్ రిటైల్ లోనూ మైనార్టీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.




కిశోర్‌ బియానీ సంస్థ ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌ బిజినెస్‌లలో రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. ఈకామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌(వాల్‌మార్ట్‌)కు పోటీగా జియో మార్ట్‌ ద్వారా రిలయన్స్‌ రిటైల్‌ వేగంగా విస్తరిస్తున్నట్లు బిజినెస్ నిపుణులు
వెల్లడిస్తున్నారు.