Touch Display : కొత్త ఆండ్రాయిడ్ Walkman వచ్చేసింది

  • Published By: sreehari ,Published On : January 23, 2020 / 07:58 AM IST
Touch Display : కొత్త ఆండ్రాయిడ్ Walkman వచ్చేసింది

టేప్ రికార్డర్ మాదిరిగా ఉండే సంప్రదాయక వాక్ మ్యాన్.. అప్పట్లో దీనికి ఫుల్ క్రేజ్ ఉండేది.. రానురానూ స్మార్ట్ ఫోన్ల ప్రాబల్యంతో Walkman ఊసే లేకుండా పోయింది. డిజిటల్ రంగంలో అన్ని మెమరీ కార్డులతోనే పాటలు వినేస్తున్నారు. ఐప్యాడ్ లు, మ్యూజిక్ పాడ్ ఇలా ఎన్నో మార్కెట్లోకి వచ్చేశాయి. ఇప్పుడు.. సరికొత్త టెక్నాలజీతో వాక్ మ్యాన్ లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. సోనీ నుంచి కొత్త ఆండ్రాయిడ్ వాక్ మ్యాన్ మార్కెట్లోకి వచ్చింది. న్యూ ఎడిషన్ వాక్ మ్యాన్ సిరీస్ ను సోనీ కంపెనీ బుధవారం లాంచ్ చేసింది. అదే.. సోనీ ఆండ్రాయిడ్ వాక్ మ్యాన్ NW-A105ను రిలీజ్ చేసింది.

మల్టీపుల్ ఆడియో ఫార్మాట్లలో :
ఒకప్పటి సంప్రదాయక వాక మ్యాన్ కు ఇది పూర్తిగా భిన్నంగా నేటి డిజిటల్ స్మార్ట్ యుగానికి తగినట్టుగా అద్భుతమైన ఫీచర్లతో సోనీ Walkman మార్కెట్లోకి దించేసింది. ఇందులోని ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. 3.6 ఇన్ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, హై రెజుల్యుషన్ ఆడియో, Wi-Fi సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ OS వెర్షన్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ వాక్ మ్యాన్ డివైజ్ రన్ అవుతుంది.

అంతేకాదు.. సోనీ అన్ని కొత్త వాక్ మ్యాన్ డివైజ్ ల్లో మల్టీపుల్ ఆడియో ఫార్మాట్స్ MP3, WMA2, WAV, AAC, FLAC, DS నుంచి 11.2 MHz వరకు హైక్వాలిటీ PCM కన్వర్సేషన్ అందిస్తోంది. అలాగే వైర్ లెస్ ఆడియో ఫార్మాట్లలో SBC, LDAC, aptX, aptX HD, AAC కూడా ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది.

Sony launches the new Sony Android Walkman
ఈ హైరెజుల్యుషన్ ఆడియో S-Master HX™ డిజిటల్ ఆంప్లిఫైయిర్, డిస్టోరేషన్, Noise తగ్గేలా డిజిటల్ ఆడియోతో DSEE HX రీబుల్డ్ చేస్తుంది. సోనీ వాక్ మ్యాన్ డిజిటల్ డివైజ్ లో బ్లూటూత్, వైర్ లెస్ కనెక్టవిటీ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC)తో పాటు 3.5mm స్టీరియో ఔట్ పుట్ కూడా ఉంది.

ఒకసారి రీఛార్జ్.. 26 గంటలు వర్కింగ్ :
ఈ డివైజ్ వాడే యూజర్లు మ్యూజిక్ స్ట్రీమ్ చేసుకోవచ్చు.కావాలంటే నేరుగా డివైజ్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 16GB మెమెరీ స్టోరేజీతో ఈ వాక్ మ్యాన్ రూపొందించింది సోనీ కంపెనీ. ఈ స్టోరేజీని 128GB వరకు ఎక్స్ ఫ్యాండ్ చేసుకోవచ్చు. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే.. USB Type-C™ పోర్ట్ కూడా ఉంది. ఒకసారి ఫుల్ గా రీఛార్జ్ చేస్తే.. 26 గంటల పాటు వస్తుంది.

ప్రస్తుతం.. సోనీ వాక్ మ్యాన్ సింగిల్ కలర్ బ్లాక్ లో మాత్రమే అందుబాటులో ఉంది. సోనీ డిజిటల్ వాక్ మ్యాన్.. (ఆండ్రాయిడ్ 9.0) దీని ధర మార్కెట్లో రూ.23వేల 990గా లభ్యం అవుతోంది. ఇండియాలోని అన్ని సోనీ సెంటర్లతో పాటు ఇతర మేజర్ ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ-కామర్స్ వెబ్ సైట్లలో జనవరి 24 (శుక్రవారం) నుంచి డివైజ్ అందుబాటులో ఉంటుంది.

ఫీచర్లు + స్పెషిఫికేషన్లు ఇవే :
* 3.6 ఇన్ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే
* హై రెజుల్యుషన్ ఆడియో
* Wi-Fi సపోర్ట్ 
* USB Type-C™ పోర్ట్
* 16GB మెమెరీ స్టోరేజీ, 128GB
* 3.5mm స్టీరియో ఔట్ పుట్
* ఆండ్రాయిడ్ OS వెర్షన్ 9.0
* బ్లూటూత్, వైర్ లెస్ కనెక్టవిటీ
* నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్