SpiceJet offer: విమాన టిక్కెట్లపై వాలెంటైన్స్ డే ఆఫర్.. జంటలకు మాత్రమే!

విమాన ప్రయాణం కోసం ప్లాన్ చేసుకుంటున్న సీనియర్ సిటిజన్‌లకు శుభవార్త చెప్పింది స్పైస్ జెట్ సంస్థ.

SpiceJet offer: విమాన టిక్కెట్లపై వాలెంటైన్స్ డే ఆఫర్.. జంటలకు మాత్రమే!

Spice Jet

SpiceJet offer: విమాన ప్రయాణం కోసం ప్లాన్ చేసుకుంటున్న సీనియర్ సిటిజన్‌లకు శుభవార్త చెప్పింది స్పైస్ జెట్ సంస్థ. వాలెంటైన్స్ డే సందర్భంగా విమాన ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకోవడంపై భారీ తగ్గింపు అవకాశం ఇస్తుంది స్పైస్‌జెట్. ప్రైవేట్ ఎయిర్‌లైన్ కంపెనీ స్పైస్‌జెట్ సీనియర్ సిటిజన్లకు బుక్ చేసుకునే విమాన టిక్కెట్లపై 14శాతం తగ్గింపును ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

స్పైస్‌జెట్ ట్వీట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. “బంగారు జంటలకు ఆహ్వానం. ఈ ‘వాలంటైన్స్‌ డే’కి ప్రత్యేకమైన ప్రాంతానికి జంటగా వెళ్లండి. ప్రత్యేక ఛార్జీలను సీనియర్ సిటిజన్‌ల కోసం మేం తీసుకుని వచ్చాం. సీనియర్ సిటిజన్లు విమాన టిక్కెట్‌లపై 14 శాతం వరకు తగ్గింపు పొందుతారు. ఇంకెందుకు ఆలస్యం.. మీ భాగస్వామితో కలిసి ఈ ‘వాలెంటైన్స్ డే’ కి కొత్త ప్రదేశానికి వెళ్లండి. చౌకగా గాల్లో తేలుతూ వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకోండి” అంటూ ఆఫర్ ప్రకటించింది.

Garikipati-Pushpa: స్మగ్లర్ ను హీరోను చేసి ఏం మెసేజ్ ఇద్దామని.. గరికపాటి ఆగ్రహం!

సీనియర్ సిటిజన్లు పుట్టిన తేదీతో చెల్లుబాటు అయ్యే ఫోటో IDని తీసుకుని రావాలి. విమానాశ్రయం చెక్-ఇన్‌లో సదరు డాక్యుమెంట్లను చూపించాలి. కరోనా మహమ్మారి మూడవ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. పలు విమానయాన సంస్థలు రాయితీలు ప్రకటించి విమానాల్లో తిరిగేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే చౌకగా విమాన టిక్కెట్లను అందిస్తున్నాయి.

Unemployement Rate: ఇండియాలో నిరుద్యోగ రేటు తెలంగాణలోనే అత్యల్పం

ఇప్పటికే ఇండిగో కూడా వ్యాక్సీ ఫేర్ స్కీమ్‌ని అందుబాటులోకి తీసుకని వచ్చింది. వాక్సిన్‌ వేయించుకుని ప్రయాణించే విమాన ప్రయాణికులకు వారి విమాన ఛార్జీలపై 10 శాతం తగ్గింపును అందిస్తోంది.