ఆన్ లైన్ షాపింగ్ కూడా ప్రమాదేమే.. ‘కరోనా’ను ఆహ్వానించినట్లే!`

  • Published By: vamsi ,Published On : March 24, 2020 / 05:29 AM IST
ఆన్ లైన్ షాపింగ్ కూడా ప్రమాదేమే.. ‘కరోనా’ను ఆహ్వానించినట్లే!`

చైనా సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనావైరస్ వ్యాపించేసింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైంది. ఈ వైరస్ ఇన్పెక్షన్‌తో మరణించిన వారి సంఖ్య 15వేలు దాటిపోయింది. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘ప్రపంచ సంక్షోభం’గా ప్రకటించింది. మొదట్లో ఈ వైరస్‌కు గురైనవారు ఎక్కువగా చైనాలో మరణించారు. ఈ క్రమంలో చైనాలో వుహాన్ లేదా ఈ వైరస్ ఉన్న వేరే ప్రాంతాల నుంచి ఏదైనా వస్తువు దిగుమతి చేసుకుని తాకితే వైరస్ వ్యాపిస్తుందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉంది.

అయితే వుహాన్ లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వస్తువులను ముట్టుకోవడం వల్ల వైరస్ వ్యాపించినట్టు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు కనిపించలేదు కానీ, ఈ వైరస్ రాగి, కార్డ్‌బోర్డ్, ప్లాస్టిక్ మరియు స్టెయిన్‌లెస్ స్టీల్‌పై స్థిరంగా ఉంటుంది. దీంతో మీ ఇంటికి వచ్చే కొరియర్ మీ ఇంటికి కొరోనా వైరస్‌ను తీసుకుని రాగలదని అంటున్నారు పరిశోధకులు. ఇంకా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటే.. జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది అని, ఆన్ లైన్ షాపింగ్ చేస్తే కరోనాకి ఆహ్వానం పలికినట్లే అని అంటున్నారు. 

కొరోనావైరస్ కార్డ్ బోర్డ్, ప్లాస్టిక్‌పై మూడు రోజుల పాటు స్థిరంగా అంటువ్యాధిగా ఉంటుంది. మూడు రోజులు అంటే అది 72 గంటలు. 72గంటల్లో సూపర్ క్విక్ కొరియర్ డెలివరీ ఇస్తే మీ ఇంటి లోపలికి ప్రవేశించడానికి కరోనా వైరస్‌కు కష్టమేం కాదు. పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం.. వివిధ పరిస్థితుల్లో ఏరోసోల్స్, ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్, రాగి మరియు కార్డ్ బోర్డ్‌లలో కరోనా వైరస్ చురుకుగా ఉంటుంది.

కాబట్టి కరోనా వైరస్ వ్యాపించడం పెద్ద కష్టమేమి కాదు.. అందుకే కరోనాని ఆహ్వానించకుండా ఉండాలంటే ఆన్ లైన్ షాపింగ్ కొన్ని రోజులు ఆపుకోవటమే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆన్ లైన్ షాపింగ్ లో విదేశాల నుంచి వచ్చే వస్తువులే ఎక్కువగా ఉండొచ్చు. సో బీ కేర్ ఫుల్.

See Also | కరీంనగర్ అష్టదిగ్భందనం…ఎక్కడి వాళ్లక్కడే