Sensex : స్టాక్ మార్కెట్ ఢమాల్.. భారీ నష్టాలు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సంకేతాలు స్టాక్‌మార్కెట్లను ప్రభావితం చేశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో నమోదవడం, యుక్రెయిన్ యుద్ధం, ముడిచమురు ధరల పెరుగుదల...

Sensex : స్టాక్ మార్కెట్ ఢమాల్.. భారీ నష్టాలు

Stock

Stock Market Live Update : స్టాక్ మార్కెట్లు కోలుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. లాభాల బాట పట్టిందన్న సంతోషం కొద్దిసేపు కూడా నిలవడం లేదు. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 2022, ఏప్రిల్ 18వ తేదీ సోమవారం మార్కెట్లు ప్రారంభం నుంచే నష్టాల బాట పట్టాయి. సాయంత్రం ముగిసే సరికి భారీ నష్టాల మూటగట్టాయి. 1,172 పాయింట్లు తగ్గి.. 57 వేల 166 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 302 పాయింట్లు తగ్గి.. 17 వేల 173 వద్ద నిఫ్టీ ట్రేడ్ అయ్యింది. బ్యాంకు నిఫ్టీ 734 పాయింట్లు తగ్గింది.

Read More : Stock Market : దలాల్ స్ట్రీట్ ఢమాల్.. మార్కెట్లు అతాలకుతలం.. నేడు పెట్రోల్ ధరల పెంపు ?

నాలుగు రోజుల సెలవుల తర్వాత మొదలైన మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 12వందల పాయింట్లకు పైగా కోల్పోయి 58వేల దిగువన ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ 17వేల దిగువన ట్రేడ్ అయ్యింది. ఐటీ షేర్ల పతనం, అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లను నష్టాల బాట పట్టించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఇన్ఫోసిస్ లాభాలు అంచనా కన్నా తక్కువగా 9.1శాతం నమోదయ్యాయి. మార్చి త్రైమాసికానికి ఇన్ఫోసిస్ 5 వేల 980 కోట్ల నెట్ ఫ్రాఫిట్ సాధిస్తుందని అంచనా వేయగా 5 వేల 680 కోట్లు మాత్రమే లాభాలు నమోదయ్యాయి. ఇది ఐటీ షేర్ల పతనానికి దారితీసింది. ఇన్ఫోసిస్ షేర్లు 6శాతం నష్టపోయాయి. టెక్ మహీంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీ నష్టాలు నమోదుచేస్తున్నాయి.

Read More : Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్.. జోరుగా ట్రేడింగ్!

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సంకేతాలు స్టాక్‌మార్కెట్లను ప్రభావితం చేశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో నమోదవడం, యుక్రెయిన్ యుద్ధం, ముడిచమురు ధరల పెరుగుదల వంటి కారణాలతో అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారత్‌లోనూ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ట స్థాయికి చేరింది. మార్చిలో 6.95శాతం నమోదయింది. హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.