Holi 2023..Swiggy ‘Egg Ad’ : ‘గుడ్లను ఆమ్లెట్‌ వేసుకోవడానికి వాడండీ..ఎవరి తలమీదా కొట్టడానికి కాదు’ హోలీ స్విగ్గీ యాడ్‌పై ఆగ్రహం

‘గుడ్లను ఆమ్లెట్‌ వేసుకోవడానికి వాడండీ..ఎవరి తలమీదా కొట్టడానికి కాదు’ అంటూ హోలీ పండుగ సందర్భంగా స్విగ్గీ రూపొందించిన యాడ్‌పై ఆగ్రహం వెల్లువెత్తాయి.

Holi 2023..Swiggy ‘Egg Ad’ : ‘గుడ్లను ఆమ్లెట్‌ వేసుకోవడానికి వాడండీ..ఎవరి తలమీదా కొట్టడానికి కాదు’ హోలీ స్విగ్గీ యాడ్‌పై ఆగ్రహం

Holi 2023..Swiggy 'Dgg Ad'

Holi 2023..Swiggy ‘Egg Ad’ : ఒకోసారి ఏదో చేద్దామనుకుంటే మరేదో అవుతుంది. చిన్న చిన్న పొరపాట్లు కూడా వివాదానికి కారణమవుతాయి. ఏదో కొత్తగా ట్రై చేద్దామనుకుంటే అది చింకి చాటంత అవుతుంది. అదే జరిగింది ఈ ‘హోలీ’ (2023) పండుగ సందర్భంగా ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ఇచ్చిన ఓ ప్రకటన.. ఏదైనా పండుగ వచ్చింది అంటూ దాన్ని తమ వ్యాపారం కోసం ఎలా వాడుకోవాలా? అని ఆలోచిస్తాయి సంబంధిత సంస్థలు. సరిగ్గా అలాగే ఆలోచించింది స్విగ్గీ కూడా. హోలీ పండుగకు రంగుల చల్లుకోవటంతో పాటు గుడ్లతో కూడా కొట్టుకుంటుంటారు. సరిగ్గా అదే విషయాన్ని కాస్త విభిన్నంగా .. గుడ్లను ఎందుకోసం వాడాలో చెప్పాలని ఓ యాడ్ రూపొందించింది స్విగ్గీ. ఈక్రమంలో కాస్త అత్యుత్సాహం ప్రదర్శించిందంటున్నారు కొంతమంది. స్విగ్గీ యాడ్ వివాదాస్పదమైంది.దీంతో స్విగ్గీపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏకంగా స్విగ్గీని బ్యాన్ చేయాలంటున్నారు. ఇంతకీ స్విగ్గీ చేసిన ఆ యాడ్ లో అంత ఆగ్రహం కలిగించే విషయం ఏముందో తెలుసుకుందాం..

ఫుడ్‌ డెలివరీతో పాటు నిత్యావసర వస్తువుల్నికూడా ఇన్‌స్టామార్ట్‌ పేరిట డెలివరీ చేస్తున్న స్విగ్గీ హోలీ సందర్భంగా ఓ యాడ్ ను రూపొందించింది. ఆ యాడ్ లో చుట్టూ హోలీ రంగులున్నాయి. మధ్యలో రెండు కోడిగుడ్లు ఉన్నాయి. అక్కడి వరకు బాగానే ఉంది. ఈ యాడ్ లో స్విగ్గీ ‘గుడ్లను ఆమ్లెట్‌ వేసుకోవడానికి వినియోగించండి.. కానీ ఎవరి తలమీదా కొట్టడానికి కాదు’ అని అర్థం వచ్చేలా ప్రకటనను రూపొందించింది. హోలీకి సంబంధించిన సరకులను ఇన్‌స్టామార్ట్‌లో తెప్పించుకోండి అని చెబుతునే గుడ్లను తలమీద కొట్టటానికి కూడా ఆమ్లెట్లు వేసుకోండి అంటూ సూచించింది. దీనికి #BuraMatKhelo అనే హ్యాష్‌ట్యాగ్‌ను యాడ్ చేసింది..ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఏర్పాటు చేసిన ఈ యాడ్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

దీంతో #HinduphobicSwiggy అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు వెల్లువెత్తాయి. స్విగ్గీని బాయ్‌కాట్‌ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. హోలీ పండుగ సందర్భంగా ఇటువంటి యాడ్ ఇచ్చిన స్విగ్గీ ఇతర పండగల విషయంలో ఇలాంటి ప్రకటనలు ఎందుకు ఇవ్వట్లేదు? అంటూ వీహెచ్‌పీ నేత సాధ్వీ ప్రాచీ ఆగ్రహం వ్యక్తంచేశారు. వినియోగదారులపై ఆధారపడి నడిచే సంస్థలు అన్ని మతాలను గౌరవించాలని, అన్ని పండుగలను గౌవరించాలని ట్వీట్ చేశారు. అలాగే ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన హిందూ సంఘాలు స్విగ్గీని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. వివాదాస్పదమైన ప్రకటనలు ఇచ్చి లక్షలాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న స్విగ్గీ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత అరుణ్‌ కుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. ఏదో చేద్దామనుకుంటే మరేదో అయిందని భావించిన స్విగ్గీ ఈ యాడ్‌ను తొలగించింది..